Telugu States

హైదరాబాద్ లో టీఆర్ఎస్ పెట్టిన ఫ్లెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..! దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోయినా.. పర్వాలేదు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పనిగట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్లెక్సీలు, ర్యాలీలు తీస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే రూట్లలోనే ప్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొడుతున్నారని.. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంతో పాటు అహంకారం చూపిస్తోందని తెలిపారు. అధికారం చేతిలో ఉందని ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తోందని అన్నారు.

జూలై 2 మరియు 3 తేదీల్లో నగరాన్ని సందర్శించడానికి ప్రధాని మోదీ వస్తుండగా.. ఆయన పాలనను విమర్శిస్తూ నగరంలోని పలు ప్రాంతాలలో అనేక బిల్ బోర్డులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధానమంత్రి, ఇతర బీజేపీ సభ్యులు వెళ్లే మార్గాల వెంబడి వ్యూహాత్మకంగా మోదీ వ్యతిరేక హోర్డింగ్‌లు ఉంచాయి టీఆర్ఎస్ శ్రేణులు. మోదీ దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎల్‌బీ నగర్‌లో భారీ హోర్డింగ్‌ పెట్టారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన కొన్ని బ్యానర్లపై తాము ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్‌లోని బీజేపీ న్యాయవాద బృందం సభ్యుడు భార్గవ్ రామ్ నీలం తెలిపారు. కొన్ని హోర్డింగ్ లను అధికారులు తీసివేశారు.

Related Articles

Back to top button