చిలకలూరిపేట నుంచి నెల్లూరు కు వెళుతున్న రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే 16 పెళ్లూరు వద్ద కాన్వాయ్ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన దారి మళ్లింపు బార్ గేట్స్ వద్ద కాన్వాయ్ లోని ముందు కారు బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి మూడు కార్లు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాయి. కాన్వాయ్ లో ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన వేరే వాహనాలను తెప్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నారు. కాన్వాయ్ లో కార్లు ఢీకొనడానికి దారితీసిన కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.