Telugu States

మినిస్టర్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

విశాఖపట్నంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందడంతో ఈ రోజు ఉదయం అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిరసనకు దిగారు. విశాఖపట్టణంలో మంత్రుల కాన్వాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని మంత్రుల కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న అతడు కింద పడిపోయాడు. అదే సమయంలో వెనకాలే వస్తున్న మరో వాహనం అతనిపై నుంచి వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అయ్యాయి. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న సూర్యానారాయణ మంగళవారం మధ్యాహ్నం పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బిర్లా జంక్షన్‌ వద్ద ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా గణపతినగరంకు చెందిన వ్యక్తి. మృతుడికి భార్య వరలక్ష్మీ, ఇంటర్‌ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు నందిని, ఉష, కుమారుడు వంశీ ఉన్నారు.

అవంతి వాహనం ఢీకొట్ట‌డం వ‌ల్లే సూర్యనారాయణ మృతి చెందాడని.. ప్రభుత్వం తరఫున త‌మ‌కు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం మంత్రి అవంతి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. అవంతి శ్రీ‌నివాస్ మృతుడి బంధువుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ ఘోర‌ ప్ర‌మాదం జ‌రిగిన‌ స‌మ‌యంలో వాహ‌నంలో తాను లేనని ఆయ‌న చెప్పారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము మాన‌వ‌తా దృక్ప‌థంతోనే ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బంధువులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − nineteen =

Back to top button