National

అవును.. నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం

నకిలీ వార్తలు ప్రసారం చేసే సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్ర ప్రభుత్వం కత్తెర వేస్తూ వస్తోంది. దేశం గురించి అబద్ధాలు చెప్పే వారిని, అసత్యాలు ప్రచారం చేసే వారిని కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. తాజాగా మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2021-22 మధ్య కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్ (URL)లపై నిషేధం విధించింది. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ యాక్ట్ -2020 కింద గతేడాది ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను రూపొందించినట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్‌లు ఉల్లంఘించే యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని మంత్రి అన్నారు.

Related Articles

Back to top button