More

  అక్రమ మైనింగ్‎ను అడ్డుకున్నందుకు ట్రక్కుతో ఎక్కించి..!

  అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ ఆఫీసర్‌ను ట్రక్కు ఎక్కించి హత్య చేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న నుహ్ పచ్‌గావ్ పరిధిలో జరిగింది.

  మెవాట్ డీఎస్పీగా పనిచేస్తున్న సురేంద్ర సింగ్‌కు ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమచారం అందింది. దీంతో ఈ మైనింగ్‌ను అడ్డుకునేందుకు డీఎస్పీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించాడు. ఆ ట్రక్కును ఆపాల్సిందిగా సూచించాడు. కానీ, డ్రైవర్ ట్రక్కును ఆపకుండా, పోలీస్‌పైకి ఎక్కించాడు.

  భారీ రాళ్లతో ఉన్న ట్రక్కు శరీరం పైనుంచి వెళ్లడంతో పోలీసు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత డ్రైవర్‌తోపాటు నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సురేంద్ర సింగ్ త్వరలో రిటైర్ అవ్వాల్సి ఉంది.

  spot_img

  Trending Stories

  Related Stories