రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మరణించారు.శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించారు. సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.
జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని సుదాసిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని.. సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ మీడియా కు తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఎస్పీ తెలిపారు.శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఐఎఎఫ్ యొక్క మిగ్-21 విమానం శిక్షణ సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ఎగురుతూ ప్రమాదానికి గురైన ఘటనపై విచారణకు ఆదేశించారు.
విమానంలో మంటలు చెలరేగడం తాను చూశానని ఎడారి జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న ప్రత్యక్ష సాక్షి చెప్పారు. విమానం నేలను ఢీకొనక ముందే మంటలు అంటుకున్నాయని చెప్పుకొచ్చారు. వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా కుటుంబానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా సంతాపం తెలిపారు. రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కూడా ఐఏఎఫ్ పైలట్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
“This evening, around 8.30 pm, a MiG-21 aircraft of IAF met with a flying accident in the western sector during a training sortie. An inquiry is being ordered.” అంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించిన ఘటనపై IAF తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పటికీ ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ప్రకారం, విమానం నేలను ఢీకొనక ముందే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. జైసల్మేర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ సింగ్, కలెక్టర్ ఆశిష్ మోదీ ఘటనా స్థలానికి చేరుకున్నారు.