అమ్మా నాన్నలపై సెటైర్లు.. దేవీదేవతలపై బూతులు.. స్టాండప్ కామెడీలా..? ‘A’ సర్టిఫికెట్ సినిమాలా..?

0
630

‘నవ్వించేవాడు యోగి.. నవ్వేవాడు భోగి.. నవ్వని వాడు రోగి’ అంటారు. కానీ, స్టాండప్ కామెడీ షోల తీరు చూస్తుంటే.. ‘నవ్వించే వాడు రోగి’ అన్నట్టు తయారైంది పరిస్థితి. స్టాండప్ కామెడీ షోల్లో ఒక వ్యక్తి స్టేజీపై నిలబడి,.. తన జీవితంలో ఎదురైన సంఘటనలను ఆధారంగా చేసుకుని,.. దానికి మరికాస్త ఊహాజనిత కల్పితాలను జోడించి హాస్యాన్ని పంచుతాడు. ఒకప్పుడు ఈ స్టాండప్ కామెడీకి కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే జనాదరణ ఉండేది. కానీ, ఇంటర్నెట్ వాడకం ఎక్కువైనకొద్దీ దీనికి భారత్‎లో కూడా జనాదరణ పెరుగుతూ వచ్చింది. యూట్యూబ్, ఫేస్‎బుక్ లాంటి సోషల్ మీడియాలతో ఈ స్టాండప్ కామెడీ ప్రజలందరికీ చేరువైంది. దీన్ని ఎంతోమంది ప్రజలు తమ ఇళ్ళలో కుటుంబసమేతంగా కూడా చూసేవారున్నారు. భారత్‎లో స్టాండప్ కామెడీ ప్రవేశించిన మొదట్లో దీన్ని బాగా ఆదరించేవారు. ‘రాజు శ్రీవాస్తవ’ లాంటి ఎంతో జనాదరణ పొందిన స్టాండప్ కమెడియన్లు ఉన్నారు. అయితే, తర్వాతి కాలంలో ఈ కామెడీ కాస్తా దారిమళ్ళటం మొదలుపెట్టింది. రాను రాను స్టాండప్ కామెడీల్లో కామెడీ తగ్గిపోయి.. ఆ స్థానాన్ని హేయకరమైన భాష ఆక్రమించింది. బూతులనే కామెడీగా భావించే స్థాయికి దిగజారింది. ఏకంగా తల్లిదండ్రులపైనే సెటైర్లు వేసే స్థాయికి చేరుకుంది. అంతేకాదు, ఇతరులను వ్యక్తిగతంగా కించపరచడానికి, ఇతర మతాల దేవతలను దూషించడానికి స్టాండప్ కామెడీ ఒక సాధనంగా మారిపోయింది.

ఏరంగంలోనైనా ఎదగాలంటే స్వంత నైపుణ్యంతోనే ఎదగాల్సి ఉంటుంది. దానికి అవసరమైన నైపుణ్యాన్ని కాలానుగుణంగా జోడిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది స్టాండప్ కమెడియన్లు త్వరగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో కామెడీని పక్కదారి పట్టిస్తున్నారు. తమ భాషల్లో వల్గర్ లాంగ్వేజ్ ను ఉపయోగిస్తే ఎక్కువ మంది చూస్తారనే కోణంలో అందులో బూతులను ఉపయోగిస్తూ వస్తున్నారు. నిజానికి, పాశ్చ్యాత్త దేశాల్లోని స్టాండప్ కామెడీ షోలలో ఎక్కువగా బూతు పదాలే కనిపిస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో సంస్కృతీ సాంప్రదాయాలు, కుటుంబాలతో సత్సంబంధాలూ అంతగా ఉండవు. దీంతోపాటు అక్కడి సమాజంలో కూడా వల్గర్ లాంగ్వేజ్ ను సమర్థించేవారు ఎక్కువగానే ఉంటారు. అందుకే అక్కడి స్టాండప్ కామెడీ షోలలో వల్గర్ లాంగ్వేజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, భారతీయ సంస్కృతి అందుకు భిన్నంగా ఉంటుంది. భారతీయులు నలుగురి మధ్య బూతులు వినడాన్ని ఇష్టపడరు. దీంతో పాటు భారత కుటుంబాల మధ్య సత్సంబంధాలు కూడా ఎక్కువే కాబట్టి తల్లిదండ్రులపై ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. అందువల్ల భారత్ లో నిర్వహించే కామెడీ షోలలో వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉపయోగించకుండా ఉండాల్సిన అవసరముంది. అయితే ఇప్పటి కమెడియన్లు ఈ విషయాన్ని ఎంతమాత్రమూ పట్టించుకోవడంలేదు. బూతులనే ఆధారంగా చేసుకుని స్టేజి షో లను నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ బూతులు మరీ శృతి మించుతున్నాయి. ‘మేరీ మా ఘటియా థీ’ , ‘మేరా బాప్ బద్సూరత్ హై’ అనే పదాలను కూడా ఉపయోగిస్తూ తల్లిదండ్రులను సైతం బూతు పదాలుగా మార్చే సంస్కృతి స్టాండప్ కామెడీల్లో ఎక్కువవుతోంది.

ఇక బూతు పదాలను ఉపయోగించే వారు కొందరైతే,.. స్టాండప్ కామెడీతో త్వరగా పాపులర్ అయిపోవాలనే ఉద్దేశంతో హిందూ దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇతర దేశాల్లో భారత్ ను కించపరిచే దారుణ పోకడ పెరుగుతూ వస్తోంది. ఇందులో మునావర్ ఫరూఖీ, కునాల్ కమ్రా, వీర్ దాస్ లు మొదటి వరుసలో ఉంటారు. వీరికి స్టాండప్ కామెడీలపై అంతగా పట్టు లేకపోయినా,.. వీరి కామెడీలు ప్రజలకు రోత పుట్టించినా ముగ్గురూ ఫేమస్ కావడానికి ఒక్కటే కారణం. ఇందులో మునావర్, కునాల్ కమ్రాలు హిందూ దేవీ దేవతలపై దుర్భాషలాడితే,.. వీర్ దాస్ మాత్రం ఏకంగా విదేశీ గడ్డపై భారత్ ను కించపరుస్తూ ఫేమస్ అయ్యాడు. వీరి వ్యవహారంతో దేశంలో స్టాండప్ కామెడీకి ఉన్న ఆదరణ కాస్త తగ్గిపోయి దానిపై వ్యతిరేకత రావడం మొదలైంది. మునావర్ ఫరూఖీ గతంలో స్టాండప్ కామెడీ పేరుతో హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో మునావర్ ఎక్కడ కామెడీ షో లు నిర్వహించినా శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నో రాష్ట్రాలు ఇతడి షోలకు అనుమతిని నిరాకరించాయి.

ఇక కామెడీ షో ను నిర్వహిస్తే మతఘర్షణలు జరుగుతాయా అని కొంతమంది మునావర్ ను తేలిగ్గా తీసుకున్నారు. హైదరాబాద్ ట్విట్టర్ మంత్రి కేటీఆర్ అయితే ఒకడుగు ముందుకేసి కమెడియన్ కు వేలమంది పోలీసుల భద్రత కల్పించి కామెడీ షో ను నిర్వహించడానికి ప్రభుత్వం తరపున సహకారం అందించాడు. ఆ తర్వాత రోజు హైదరాబాద్ పాతబస్తీలో మతఘర్షణలు జరగటంతో ట్విట్టర్ మంత్రికి తత్వం బోధపడింది. మునావర్ వల్ల ఎంత వినాశనం జరుగుతుందో కేటీఆర్ స్వయంగా చూశారు. ఇక మునావర్ తో పాటు కునాల్ కమ్రా షో లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నోసార్లు అడ్డుకోవాల్సి వచ్చింది. అయితే మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన కమెడియన్ల మాట అటుంచితే,.. వీర్ దాస్ అనే కమెడియన్ తన స్వంత ఇమేజ్ పెరగడంకోసం ఏకంగా విదేశాల్లోనే భారత్ ను అవమానించే స్థాయికి దిగజారాడు. వాషింగ్టన్ డీసీలో ‘జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌’ అనే సంస్థ నిర్వహించిన స్టేజి షో లో భారత్ ను అత్యంత దారుణంగా అవమానించాడు. ఈ షోలో కామెడీ చేయకుండా భారత్ ను అత్యాచారాల దేశంగా చెబుతూ కించపరిచాడు. అంతేకాకుండా పీఎం కేర్ ఫండ్ పైనా, భారత జర్నలిస్టులను సైతం అవమానిస్తూ దారుణ వ్యాఖ్యలు చేశాడు. విదేశీయుల ముందు అసత్యాలతో భారత్ పై విషం చిమ్మాడు. దీంతో భారత్ పరువు కాస్తా విదేశీయుల ముందు తగ్గిపోయినంత పనైయింది. ఈ షో నిర్వహించిన తర్వాత భారత్ లోని ఎన్నో రాష్ట్రాలు వీర్ దాస్ షో లపై పూర్తి నిషేధాన్ని ప్రకటించాయి.

ఈ విధంగా భారత స్టాండప్ కామెడీలోని విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. దీంతో రానురానూ వీక్షకుల ఆదరణ కూడా తగ్గిపోతూ వస్తోంది. ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయాక ఇంట్లోని పిల్లలు పెద్దలతో పాటు ఈ స్టాండప్ కామెడీ షోలును కలిసి చూసేవారు. అయితే రానురానూ వీటిలో వల్గర్ టాకింగ్ పెరిగిపోతుండటంతో పాటుగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు ఎక్కువవుతుండటంతో కుటుంబ సమేతంగా చూడటం తగ్గిపోతోంది. అందరూ కలిసి నవ్వుకోవాల్సిన షోలు కాస్తా 18 ప్లస్ షోలుగా రూపాంతరం చెందటంతో,.. ఎవరికి వారు ఒంటరిగా చూడటమే తప్ప కలిసి చూడటం తగ్గిపోయింది. అందుకే, ఇకనైనా స్టాండప్ కామెడీ షోలు నిర్వహించేవారు ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ఈ విషయంలో ఒకప్పటి స్టాండప్ కమెడియన్ దివంగత ‘రాజు శ్రీవాస్తవ’ ని ఆదర్శంగా తీసుకుని ఆహ్లాదకరమైన కామెడీని అందించాల్సిన అవసరముంది. అంతేకాదు, మునావర్, కునాల్ కమ్రా, వీర్ దాస్ లాంటి వివాదాస్పద కమెడియన్లను దూరం పెట్టాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే, పదిమందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ చానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండం మర్చిపోవద్దు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 − eleven =