National

హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ ను మట్టుబెట్టిన భారత సైన్యం

జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ ను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయిని బుధవారం ఉదయం ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా దళాలు తీవ్రవాదులను మట్టు బెట్టాయి. గతంలో ఉబైద్‌ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని ట్వీట్‌ చేశారు.

ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న నేపథ్యంలో బుధవారం ఉదయం హంద్వారాలోని పాజిపోరా-రెనాన్ వద్ద దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో దళాలపై తీవ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. దీంతో దళాలు వారిపై ఎదురుదాడికి దిగడంతో తీవ్రవాదులు మరణించారు. “హెచ్ఎమ్ ఉగ్రవాద సంస్థ యొక్క పురాతన మరియు అగ్ర కమాండర్లలో ఒకరు మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ హంద్వారా ఎన్కౌంటర్లో మరణించాడు. అతను అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడ్డాడు ”అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) కాశ్మీర్ విజయ్ కుమార్ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది భద్రతా దళాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మెహరాజుద్దీన్ ఎన్‌కౌంటర్ భద్రతా దళాలకు పెద్ద విజయమని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ శేఖర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుర్హాన్ వాని మరణం తర్వాత ఉబైద్ కీలకమైన ఆపరేషన్లను చేపట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × five =

Back to top button