జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీకి శ్రీనగర్‌లోని అధికారిక బంగళాను ఖాళీ చేయాల్సింది అధికార యంత్రాంగం తాజాగా నోటీసులు పంపింది. కొద్దిరోజుల క్రితమే ఆమెకు ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనగర్‌లోని అత్యంత భద్రతా ఏర్పాట్లున్న గుప్కార్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బంగ్లా ఉంది. తనకు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం అనిపించలేదని, ఇది ఊహించినదేనని ఆమె అన్నారు.. తాను ఉంటున్న బంగ్లా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రికి ఉద్దేశించినదని తనకు నోటీసులు ఇచ్చారని, అయితే విషయం అది కాదని ఆమె అన్నారు. తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఈ విషయమై మా లీగల్ టీమ్‌తో మాట్లాడుతానని మెహబూబూ తెలిపారు.
మెహబూబా ముఫ్తీ 2005 నుండి ఆమె ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంది. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌కి ఎదురుగా ఉన్న గుప్కర్ రోడ్‌లోని ఇంటిని ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌కు కేటాయించారని అంటున్నారు. 1996లో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ జైట్లీ అక్కడికి వెళ్లి తన నివాసంగా ఉపయోగించుకున్నారు. 2003లో దీన్ని రేనోవేట్ చేశారు. అప్పటి ఆర్థిక మంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్ నివాసంగా ఉండేది.