More

    పదవి నుంచి దిగిన గంటల్లోనే మాజీ రాష్ట్రపతిపై విమర్శలు..!

    దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన రామ్‌నాథ్‌ కోవింద్‌పై జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు.

    బీజేపీ రాజకీయ ఎజెండాను ఆయన నెరవేర్చారని విమర్శించారు. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి, వారసత్వాన్ని వదిలివేశారన్న ఆమె… భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. రాజ్యాంగాన్ని పణంగా పెట్టి ఆర్టికల్ 370, సీఏఏ రద్దు, మైనారిటీలు, దళితుల అణచివేత వంటి బీజేపీ రాజకీయ ఎజెండాను నెరవేర్చారని మెహబూబా విమర్శించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌ చేశారు.

    కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్ట్‌ 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. అంతేగాక ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వివాదస్పదమైంది. 2019లో దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తెచ్చిన ఈ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి దిగిన వేళ, బీజేపీ ఎజెండాను పూర్తి చేశారంటూ ముఫ్తీ విమర్శించారు.

    spot_img

    Trending Stories

    Related Stories