చిరంజీవికి క్యాన్సర్ అంటూ వార్తలు.. సున్నితంగా వివరణ ఇచ్చిన మెగాస్టార్..!

0
305

శనివారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ పై మాట్లాడుతూ.. తాను అలర్ట్​గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా non – cancerous polypsను డిటెక్ట్ చేసి.. వాటిని డాక్టర్లు తీసేశారు చిరంజీవి తెలిపారు. ఏఐజీ ఆస్పత్రిలో ఒక వయస్సు దాటిన తర్వాత.. కొలనోస్కోపీ చేయించుకున్నట్లు చిరు చెప్పారు. ఆ రిపోర్ట్‌లో తన శరీరంలోని పాలిప్స్‌ను డాక్టర్లు గుర్తించారని.. ఆ పాలిప్స్‌ను వదిలేస్తే మెలాగ్లిన్ మారే చాన్స్ ఉందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. 80 నుంచి 90 శాతం పాలిప్స్ మెలాగ్లిన్‌గా మారే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పినట్లు మెగాస్టార్ వివరించారు. ముందుగా గుర్తించిన కారణంగా డాక్టర్లు పాలిప్స్ రిమూవ్ చేశారని చెప్పారు. ఈ అవగాహన తనకు లేకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో భయమేసిందన్నారు. తనకు అవగాహన ఉండటంతోనే ముందుకు వెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నానని వివరించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదని ఆయన అన్నారు. భగవంతుడు ఇస్తే ఏం చేయలేమని.. కానీ స్మోకింగ్ చేయడం, గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వయస్సుతో పాటు కొన్ని సమస్యలు ఉంటాయని.. మంచి డైట్ పాటించి.. వ్యాయామాలు చేసి వాటి నుంచి బయట పడొచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కొందరు వ్యక్తులు చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందంటూ కథనాలను వండి వార్చారు. దీంతో చిరంజీవికి తెలిసిన వారిలోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. దీనిపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

కొద్ది సేపటి క్రితం తానొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడానని చెప్పారు. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పానని.. తాను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పానన్నారు. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పానన్నారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నానన్నారు. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు చేయించుకోవాలని మాత్రమే అన్నానని.. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో తాను క్యాన్సర్ బారిన పడ్డానని.. చికిత్స వల్ల బతికానని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయన్నారు. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ తన ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారని.. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్ అంటూ ట్విట్ చేశారు. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి అంటూ విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండని సలహా ఇచ్చారు. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ లో రాసుకొచ్చారు.