డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) మరణించినందుకు సోషల్ మీడియాలో కొందరు మతోన్మాదులు సెలెబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో అభ్యంతకర పోస్టులు చేస్తూ వెళ్లారు. అలా పోస్ట్ చేసిన 21 ఏళ్ల జవాద్ ఖాన్‌ను రాజస్థాన్‌లోని టోంక్ పోలీసులు అరెస్టు చేశారు. జవాద్ ఖాన్ జనరల్ రావత్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. జహన్నమ్‌లోకి ప్రవేశించే ముందే ఆయన సజీవ దహనమయ్యాడని చెప్పాడు.

దీన్ని గమనించిన కొందరు ఇలాంటి వ్యక్తులు ఇంకా మనలోనే ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను ఊరికే వదలకూడదని ఫిర్యాదులు చేశారు. దీంతో టోంక్ పోలీసులు రంగంలోకి దిగారు. జవాద్ ఖాన్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు.

అభ్యంతకరమైన ప్రకటనలపై, అబ్దుల్ నక్కీ ఖాన్ కుమారుడు జవాద్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు టోంక్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు. జవాద్ ఖాన్ వయస్సు 21 సంవత్సరాలు. రాజ్ టాకీస్ సమీపంలో నివసిస్తూ ఉండే వాడు. 2021 డిసెంబర్ 8న జవాద్ ఖాన్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని తమ దృష్టికి వచ్చిందని, నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

సోషల్ మీడియాలో తాలిబాన్లకు మద్దతు.. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గా

జవాద్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కొన్ని అభ్యంతకర చిత్రాలు, సందేశాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ తాలిబాన్ లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే తనను తాను ‘ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్’గా చెప్పుకున్నాడు. అతడి ట్విట్టర్ ఖాతాలో కూడా తాలిబాన్లకు మద్దతు ఇచ్చేలా పోస్టులు ఉన్నాయి. పవర్ ఫుల్ గన్ ను తన వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. అతని బయో ప్రకారం “My pull up game like [email protected].. you flee like soviet and usa. Islamic Fundamentalist.” అని ఉంది.

అతని ట్వీట్లు కూడా చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. తాలిబాన్ అనుకూల వ్యక్తి తన ముందు అసాల్ట్ రైఫిల్ ఉండగా.. దాన్ని కూడా పోస్టు చేశాడు. డిసెంబరు 6న, బాబ్రీ మసీదుగా పిలువబడే అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా, జవాద్ అక్కడ హింసాత్మకంగా మసీదును పునర్నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేయడంలో బిజీగా ఉన్నాడు. హింసాత్మకంగా తిరిగి బాబ్రీ మసీదు నిర్మించడం ఒక్కటే మార్గం అని చెప్పుకొచ్చాడు.


తోటి ఇస్లామిస్ట్ లు కూడా అతనితో కలిసి పలు పోస్టులు పంచుకున్నారు. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో షారూఖ్ పఠాన్ మొత్తం పోలీసు బలగాలను భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. ఇది కేవలం ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రమే.. ఇలాంటివి చాలానే అతడి ట్విట్టర్ ఖాతాలో ఉన్నాయి. షరియా చట్టాలను అమలు చేయాలని చెబుతూ.. తాలిబాన్లకు మద్దతు ఇస్తూ ఎన్నో పోస్టులు పెట్టాడు.

