More

    డేవిడ్ వార్నర్ కు కెప్టెన్ గా అవకాశం

    ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐపీఎల్కు దూరం కావడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు సారథ్య బాధ్యతలను అప్పగించినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది.

    రిషబ్ పంత్ కారు ప్రమాదం నుంచి కోలుకుంటూ ఉండడంతో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. డిసెంబరు 30న జరిగిన ఘోర ప్రమాదంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది. పంత్‌కు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. జనవరిలో అతడికి శస్త్రచికిత్స జరిగింది. పంత్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఐపీఎల్‌ 2023లోనూ ఆడటం లేదు. ఈ క్రమంలో పంత్‌ స్థానంలో వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమించింది.

    వార్నర్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కు తొలి IPL టైటిల్‌ అందించాడు. కానీ 2021లో ఫ్రాంచైజీ వార్నర్ ను విడుదల చేసింది. ఆ తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వచ్చాడు. గతంలో వార్నర్ 2009 నుండి 2013 వరకు ఢిల్లీకి ఆడాడు. ఇప్పుడు అతడిని కెప్టెన్ గా చేసింది ఢిల్లీ. “ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ అద్భుతమైన నాయకుడిగా ఉన్నాడు, అతని సేవలను మేమంతా కోల్పోతాము” అని ఢిల్లీ కేక్యాపిటల్స్‌జట్టు తన ప్రకటనలో తెలిపింది.

    Trending Stories

    Related Stories