More

  కశ్మీర్‎లో ‘డ్రోన్’ డేగలు..! హద్దు దాటితే వేసేస్తాయి..!!

  ఇకనుంచి భారత రక్షణ రంగంలో డేగలు కూడా ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా చేయలేని పనిని గద్దలు చేయబోతున్నాయి. పాకిస్తాన్ బోర్డర్ లలో నిరంతర గస్తీ కాస్తూ ఉగ్రదేశం పన్నే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టనున్నాయి. అదేంటి..? చిన్నపాటి డేగలు దేశ రక్షణకు ఏవిధంగ ఉపయోగపడతాయని అనుకుంటున్నారా..? ఇంతటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండగా డేగల అవసరం ఎందుకొచ్చిందనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.. స్టోరీలోకి వెళ్ళేముందు మీ స్నేహితులకు, బంధువులకు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ని సబ్ స్క్రయిబ్ చేసుకోమని చెప్పండి. తెలుగు మీడియాలో జాతీయవాద జర్నలిజాన్ని గట్టిగా చెప్పగలిగే ఏకైక ఛానెల్ మనదే అని వివరించండి.

  ఇక స్టోరీలోకి వెళితే.. భారత్ ను అస్థిర పరచాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ అనుక్షణం కుట్రలు పన్నుతూనే ఉంది. ఒకప్పుడు దేశంలోని నేరుగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి దాడులకు పాల్పడేది. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి ఉగ్రవాద వ్యతిరేక చర్యలను గట్టి నిఘాతో పర్యవేక్షిస్తోంది. దీంతో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటం దాదాపు తగ్గిపోయింది. దీంతో ఉగ్రదేశం అడ్డదారుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం మొదలుపెట్టింది. సరిహద్దుల దగ్గర నుంచి డ్రగ్స్, ఏకే 47లు, గ్రనేడ్లను పంపడానికి డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. దీంతో ఇది సైన్యానికి పెద్ద సమస్యగా తయారైంది. సాధారణంగా సైనిక డ్రోన్లు పరిమాణంలో పెద్దగా ఉండటం వల్ల వీటిని రాడార్లు పసిగడతాయి. అంతేకాకుండా ఇవి చాలా ఎత్తుకు ఎగురుతాయి కాబట్టి రాడార్లన్నీ ఎక్కువ ఎత్తులోనే నిఘాను కేంద్రీకరిస్తాయి. అయితే సాధాణ డొమెస్టిక్ డ్రోన్లయితే చిన్న పరిణామం ఉండటంతో పాటుగా తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల వీటిని రాడార్లు అంత త్వరగా పసిగట్టలేవు. ఒకవేళ పసిగట్టినా యాంటీ డ్రోన్ క్షిపణులను ఉపయోగించాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది. క్షిపణుల ధర ఎక్కువ కావడంతో సైన్యం ఎక్కువ ధర వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఈ డ్రోన్లను తక్కువ ధరకే అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా డేగలను ఉపయోగించడానికి భారత సైన్యం నిర్ణయం తీసుకుంది.

  ఇందులో భాగంగా ఇప్పటికే భారత సైన్యం డేగలకు, కుక్కలకు ట్రైనింగ్ ఇస్తోంది. సరిహద్దుల నుంచి వస్తున్న డ్రోన్లను పసిగట్టడం, వాటిని అడ్డుకోవడం లాంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తోంది. సైనిక శునకాలకు ఘ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో సరిహద్దులు దాటి వస్తున్న చిన్న చిన్న డ్రోన్ల శబ్దాలను వెంటనే పసిగట్టగలవు. దీంతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తూ ఉండే శునకాలు వీటిని త్వరగా గుర్తించే అవకాశముంటుంది. ఈ విధంగా డ్రోన్ల రాకను గుర్తించిన శునకాలు సమీపంలోని ఆర్మీ అధికారులను హెచ్చరిస్తాయి. అప్పుడు అధికారులు అప్రమత్తమై డేగలను వదులుతారు. ఇవి గాల్లోకి వేగంగా వెళ్ళి డ్రోన్లను వేటాడుతాయి. ఎంత ఎత్తులో ఉన్న డ్రోన్లనైనా ఈ డేగలు వేటాడి వాటిని కాళ్ళతో పట్టుకురావడమో లేక కింద పడేయడమో చేస్తాయి. ఈ విధంగా సైనికులు డేగలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ విజయవంతమవడంతో దీన్ని ఆర్మీ అధికారులు తాజాగా జరుగుతున్న యుద్ద అభ్యాస్ లో ప్రదర్శిస్తూ దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అర్జున్ అనే డేగ ను ఆర్మీ అధికారి వదలగానే వెంటనే వెళ్ళి డ్రోన్ ను అడ్డుకుని కూల్చివేస్తుంది.

  అయితే ఈ మిషన్ లో డేగలనే ఉపయోగించడానికి ప్రత్యేక కారణముంది. డేగలు ఇతర పక్షులకంటే ఎక్కువ పరిధిలో వేటాడుతాయి. అంతేకాకుండా తన వేటాడే పరిధి మొత్తంపైనా నిఘా వేసి ఉంచుతుంది. ఆ పరిధిలోకి వచ్చే పక్షులు, జీవులను ఎల్లప్పుడూ పసిగడుతూనే ఉంటుంది. దీంతో పాటు వీటికి వేటాడే శక్తి దృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా యాంటీ డ్రోన్ క్షిపణుల కంటే గద్దలను పెంచడం వల్ల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అందుకే భారత సైన్యం డేగలను ఎంచుకుంది. ఈ విధంగా సైన్యం డేగలను ఎంచుకోవడం మొదటిసారి కాదు. 2016లో డచ్ పోలీసులు డేగలను ఉపయోగించి డ్రోన్లను పట్టుకోవడంలో విజయం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం కూడా డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలను ఉపయోగిస్తోంది.

  ఇక ఈ డేగలను ప్రధానంగా పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్‌లను గుర్తించేందుకు భారత సైన్యం ఉపయోగిస్తోంది. ఈ సరిహద్దుల దగ్గర పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను ఎక్కువగా తరలిస్తుంటుంది. దీంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగించనున్నారు. వీటితో ఇకనుంచి భారత్ లోకి వచ్చే డ్రోన్ల సంఖ్య మరింత తగ్గిపోనుంది. పాకిస్తాన్ పంపే ఆయుధాలు స్లీపర్ సెల్ లకు అందకుండా ఇవి మరింతగా ఉపయోగపడనున్నాయి.

  Trending Stories

  Related Stories