More

    అసదుద్దీన్ ఆశలపై నీళ్లు జల్లిన మాయావతి

    రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలతో జట్టు కట్టాలని అసదుద్దీన్ ఒవైసి భావిస్తూ ఉన్నారు. అయితే ఇతర పార్టీలు ఎంఐఎంను తమ పంచన చేర్చుకోడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎంఐఎంతో జట్టు కట్టబోతోందంటూ కథనాలను వండి వార్చింది. ఈ కథనాలను బిఎస్పి అధినేత్రి మాయావతి కూడా చూశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎం పార్టీతో జట్టు కట్టే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

    2022 లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి అన్నారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ తో మాత్రమే పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఆమె అన్నారు. ఈ నెల ప్రారంభంలో, శిరోమణి అకాలీదళ్ తో పొత్తు కొత్త సామాజిక, రాజకీయ ఒరవడికి నాంది అని ఆమె అన్నారు. అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని అఖిల భారత మాల్జి-ఎ-ఇథెహాదుల్ ముస్లిమీన్ తో ఆమె తమ పొత్తును తోసిపుచ్చారు. ఒక న్యూస్ ఛానల్ నుండి వచ్చిన నివేదికపై స్పందిస్తూ.. ఆ ఛానల్ కథనాలను ఆమె ఖండించారు. తన ఖాతా నుండి ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో, తాను AIMIM తో కూటమి ఏర్పాటు చేయబోతున్నాననే వార్తలు అబద్ధమని, రాబోయే విధానసభ ఎన్నికలలో ఇరు పార్టీలు కలిసి పోరాడతాయనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.

    ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఏ ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా ఎన్నికల్లో పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆమె పంజాబ్‌ లో కూటమిని ‘మినహాయింపు’గా పేర్కొన్నారు.

    బిఎస్పి గురించి మీడియా తప్పుడు వార్తలను రూపొందిస్తున్నాయని.. వీటిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు సభ్యుడు సతీష్ చంద్ర మిశ్రాను పార్టీ మీడియా సెల్ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. పార్టీపై తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దని, పార్టీపై వాస్తవాలు తెలుసుకోవటానికి మరియు సరైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మిశ్రాను సంప్రదించాలని ఆమె మీడియాను కోరారు.

    2019 లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ నాయకులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కలవడాన్ని మాయావతి స్వాగతించారు. ఈ సమావేశం సఫలమైందని.. గొప్ప నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఈ చర్చలు దోహదపడుతాయని అన్నారు.

    Trending Stories

    Related Stories