ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా కటాఫ్ ఏరియాలో భారీ డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తున్న బలగాలకు డక్‌పొదర్ వద్ద డంప్ లభ్యమైంది. ఈ డంప్‌లో భారీ ఎత్తున పేలుడు సామాగ్రీ, ఆయుధాలు, మందుపాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మూడు తుపాకీలు, వివిధ రకాలకు చెందిన 18 మందుపాతరలు, గ్రెనైడ్స్, డిటోనేటర్స్ ఉన్నాయి. ఏవోబీలో విధ్వంసాలు చేయడానికి మావోయిస్టులు డంప్‌ను దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.