మదర్సాలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మౌల్వీ

0
1027

దాద్రా నగర్ హవేలీలోని సిల్వాస్సాలోని మదర్సా హాస్టల్‌లో చదువుతున్న ఓ మైనర్ బాలికపై మదర్సా మౌల్వీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మౌల్వీ షేక్ మహ్మద్ తారీఖ్‌ను పోస్కో చట్టం కింద అరెస్టు చేశారు. బాధితురాలి వయస్సు 17 సంవత్సరాలు. మౌల్వీ భార్య తన భర్త నిర్దోషి అని చెబుతోంది. ఆరోపణలు నిరూపిస్తే భర్త నుంచి విడాకులు తీసుకుంటానని మౌల్వీ భార్య చెబుతోంది.

బాధితురాలు మదర్సా హాస్టల్‌లో ఉండి చదువుకుంటూ ఉంది. ఇంతలో మౌల్వీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని అనారోగ్యంగా ఉందని కుటుంబాన్ని మదర్సాకు పిలిపించింది. కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్లు నివేదిక నిర్ధారించడంతో మౌల్వీని అరెస్టు చేశారు. మౌల్వీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. మౌల్వీ హాస్టల్‌లోని ఇతర బాలికలను కూడా లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలను అతడు బెదిరించి అత్యాచారం చేశాడని అనుమానిస్తూ ఉన్నారు.

Maulvi rapes Madrasa student, wife defends