అసోం సంస్కృతికి ఘోర అవమానం..
గొమాసాను విసిరికొట్టిన బద్రుద్దీన్..!

0
725

భిన్న సంస్కృతుల కలయికే భారతదేశం. రాష్ట్రాలవారీగా వేష, భాషలు.. ఆచార, వ్యవహారాలు వేరుగా వున్నా.. భారతీయ భావనే దేశ ప్రజలందరినీ కలిపివుంచుతోంది. కానీ, వలసవాద నాయకులకు ఇవేం పట్టవు. మనసులో మతవిద్వేషం తప్ప మంచి ఆలోచన లేని.. అలాంటివారికి.. భారతీయ వేష, భాషలమీద గౌరవం ఎలావుంటుంది..? అసోం ఎన్నికల ప్రచారంలో ఇదే జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి.. బంగ్లా అక్రమ చొరబాటు దారులను ఓటు బ్యాంకుగా మార్చుకుని.. రాజకీయాలు నడుపుతున్న నాయకుడు బద్రూద్దీన్ అజ్మల్. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‎తో జతకట్టిన ఇతగాడు.. మన కట్టు బొట్టును ఘోరంగా అవమానించాడు. అసోం ప్రజల సంస్కృతిని అవహేలన చేశాడు.

బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించిన ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఈసారి కాంగ్రెస్‎తో కలిసి అసోం ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఇప్పటికే అక్కడ రెండు విడతల పోలింగ్ పూర్తయింది. ఇక, మూడో విడత ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగిస్తున్నాడు బద్రుద్దీన్. తాజాగా నగర్‎బెరా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అసోం సంస్కృతిలో భాగమైన గొమాసాను ఘోరంగా అవమానించాడు. గొమాసా అంటే అసోం సంప్రదాయ కండువా. కుల, మతాలకు అతీతంగా ఈ కండువాను ధరిస్తారు. అతిథుల మెడలో గొమాసా వేసి స్వాగతం పలికే సంప్రదాయం వుంది. ఈ క్రమంలో ఓ కార్యకర్త స్టేజిపై బద్రుద్దీన్ మెడలో గొమాసా వేయబోయాడు. అంతే, అతనిలో ఎక్కడలేని ఆవేషం తన్నకొచ్చింది. నా మెడలోనే గొమాసా వేస్తావా అన్నట్టు ఊగిపోయాడు. గొమాసాను కార్యకర్త చేతిలోంచి లాగి అతని ముఖాన కొట్టాడు.

బద్రుద్దీన్ వ్యవహారంపై అసోం ప్రజల నుంచే కాకుండా.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గొమాసా కేవలం కండువా మాత్రమే కాదు.. అసోం సంస్కృతికి చిహ్నం. అసోంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశమైన నామ్‎ఘర్ దేవాలయ గర్భగుడిని కూడా గొమాసాతో అలంకరిస్తారు. అస్సామీలు గొమాసాను అంత పవిత్రంగా భావిస్తారు. అసోం పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీ గొమాసాను ధరించడంతో.. ఇటీవలికాలంలో గొమాసా అసోంలోనే కాదు, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అలాంటి గొమాసాను విసిరికొట్టి అసోం సంస్కృతిని ఘోరంగా అవమానించాడు బద్రుద్దీన్ అజ్మల్. దీంతో బద్రుద్దీన్ పై అసోం ప్రజలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బద్రుద్దీన్ చర్యను అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తప్పుబట్టారు. అసోం సంస్కృతి, సంప్రదాయాలను అగౌరవపరచడం, అవమానించడమే కాంగ్రెస్ పార్టీ, AIUDF సంప్రదాయమంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

ఇక, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సైతం బద్రుద్దీన్ చర్యను తప్పుబట్టారు. గొమాసాను అవమానించడం ద్వారా.. ఆయన అసోం ఆత్మగౌరవాన్ని కంచపరిచారంటూ ట్వీట్ చేశారు.

కొక్రాఝర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బద్రుద్దీన్ చర్యను తీవ్రంగా దుయ్యబట్టారు. గొమాసా అసోం మహిళల కృషికి నిదర్శనమని.. అలాంటి పవిత్ర కండువాను అజ్మల్ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యతో అసోంను ప్రేమించే ప్రతి ఒక్కరి మనసు గాయపడిందన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహానికి గురవుతున్నారని అన్నారు.

ఇదొక్కటే కాదు.. అసోం సంస్కృతి, సంప్రదాయాలను, అక్కడి ప్రజలను ఎన్నోసార్లు అవమానానికి గురిచేశాడు బద్రుద్దీన్ అజ్మల్. చివరికి పాత్రికేయులను సైతం అగౌరవపరిచాడు. ఎన్నికలపై అజ్మల్ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్న టీవీ ఛానెళ్లలో ఓ ఛానెల్ మైకును లాగిపారేశాడు. అంతేకాదు, మౌలానా కూడా అయిన బద్రుద్దీన్ అజ్మల్ ఎన్నికల ర్యాలీల్లోనూ తన మౌలానా విధులను నిర్వర్తిస్తూవుంటాడు. ఆయన దీవెనల కోసం వచ్చేవారి ఆహారపదార్థాలపై ఉమ్మివేసిన దృశ్యాలు గతంలో ఎన్నో విమర్శలకు తావిచ్చాయి. తన సంప్రదాయాన్ని మాత్రం గౌరవిస్తూ.. అసోం సంస్కృతి, సంప్రదాయాలను అగౌరవించడం పట్ల బద్రుద్దీన్ అజ్మల్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మైనార్టీ ఓటు బ్యాంకు కోసం అలాంటి వ్యక్తితో జతకట్టిన కాంగ్రెస్ పార్టీపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

six + two =