More

    మదర్సాలో 11 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన మౌలానా

    11 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన మౌలానా మహ్మద్ జావేద్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ పరిసరాల్లోని మదర్సాలో చదువుతున్న 11 ఏళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మౌలానాపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాలుడు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల నివేదికను అనుసరించి, కరవాల్ నగర్ పోలీసులు పిల్లాడి వాంగ్మూలం ఆధారంగా IPC 377, POCSO చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని మౌలానా జావేద్ బాలుడిని పదేపదే బెదిరించాడని ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాలుగా, మౌలానా మదర్సాలో పిల్లలకు బోధిస్తున్నాడు. ముజఫర్ నగర్‌కు చెందిన అరోలి మౌలానా మహ్మద్ జావేద్ 24 ఏళ్ల వ్యక్తి. అతడికి పెళ్లి అయి.. ఒక కుమార్తె కూడా ఉంది.

    Trending Stories

    Related Stories