జమ్మూ కశ్మీర్‌లోని జామియా మసీదులో భారీ అగ్నిప్రమాదం

0
627

జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉన్న జామియా మసీదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ ఆర్మీ, పోలీస్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ మంటలను ఆర్పాయి. మంటల కారణంగా జామియా మసీదుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా మసీదులో చాలా భాగం దగ్ధమైందని.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ద్రాస్ లో అగ్నిమాపక సేవలు లేకపోవడం దురదృష్టకరమని.. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని మసీదు నిర్వాహకులు తెలిపారు. జామియా మసీదులో జరిగిన అగ్నిప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలను అక్కడికి తరలించారు. మసీదు లోపల పలు నిర్మాణాలు చెక్కతో తయారు చేయడంతో మంటలు వ్యాపించాయి.