National

టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ విధ్వంసం.. నలుగురు దుర్మరణం

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో.. ఒక అంబులెన్స్ అదుపు తప్పి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లిన వీడియో కలకలం రేపింది. ఈ ప్రమాదం 2022 జులై 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు కుందాపుర సమీపంలోని షిరూర్ టోల్‌గేట్ వద్ద చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు, టోల్ ప్లాజా వద్ద ఒక కార్మికుడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు.

టోల్ ప్లాజా కార్మికులు అంబులెన్స్ కు.. అడ్డంకులను తొలగిస్తూ ఉండగా వేగంగా వెళుతున్న వాహనం.. ఒక్కసారిగా జారడంతో ఒక పిల్లర్‌ను బలంగా ఢీకొట్టగా.. వాహనం వెనుక భాగం ధ్వంసం అయింది. సిసిటివి ఫుటేజీలో.. అంబులెన్స్ టోల్ బూత్‌లోకి దూసుకెళ్లినప్పుడు కొంతమంది వ్యక్తులను ఢీకొట్టింది. ఒక్కసారిగా అంబులెన్స్ లో నుండి అందరూ బయటకు విసిరివేయబడ్డారు. ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవరానికి తరలిస్తూ ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఉడిపి జిల్లా బైందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హొన్నావర్ నుండి ఉడిపికి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో ఏడుగురు వ్యక్తులు ఉన్నారని బైందూర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ తెలిపారు. టోల్ గేట్ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్లాస్టిక్ అడ్డాలను తొలగిస్తుండగా వేగంగా వచ్చిన వాహనం టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Back to top button