రవితేజ ‘ధమాకా’ టీజర్ వచ్చేసింది!

0
748
Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s
Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s "DHAMAKA" Mass Cracker (Teaser) Unleashed, Movie Releasing In December

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా డిసెంబర్‌లో విడుదల కానుంది. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
ఈరోజు ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీలో విడుదల చేసిన మేకర్స్ దీపావళిని ముందుగానే ప్రారభించారు. టీజర్ లోకి వెళితే.. ధమాకా రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. టీజర్ రవితేజ డాషింగ్ క్యారెక్టర్‌ ని ప్రజంట్ చేసింది డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు రవితేజ.
టీజర్ లో రవితేజ పలికిన కొన్ని వన్ లైనర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు.. కానీ నేను యాక్షన్ లో ఉన్నప్పుడు శాడిస్ట్ ని” అంటూ ఇంగ్లీష్ లో చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. “అట్నుంచీ ఒక బుల్లెట్ వస్తే… ఇట్నుంచి దీపావళి…” అనే డైలాగ్ కూడా రవితేజ మార్క్ లో పవర్ ఫుల్ గా పేలింది.
ధమాకా మాస్ టీజర్ సినిమా పై మరిన్ని భారీ అంచనాలు పెంచింది. సినిమాలో రవితేజ ఊర మాస్ క్యారెక్టర్‌ని చూపించే విధంగా టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి.
‘డబుల్ ఇంపాక్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ తగ్గట్టు టీజర్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ కథనాన్ని ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి.
ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
తారాగణం: రవితేజ, శ్రీలీల
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 1 =