మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఎల్లుండి బీజేపీలో చేరనున్నారు. రేపు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. వారి సమక్షంలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మర్రి శశధర్రెడ్డి తెలిపారు.
నిన్న కాంగ్రెస్ పార్టీకి మర్రి శశధర్రెడ్డి రాజీనామా చేశారు. చాలా బాధతో రాజీనామా చేశానని.. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలవడం, కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంది. శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు.