More

    బీజేపీలో చేరిన మర్రి శశిధర్‎రెడ్డి

    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‎రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆయనకు
    కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శశిధర్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్నారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు.

    ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‎షాను కలిసిన శశిధర్‌‌రెడ్డి బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించిన తరువాత రెండు రోజులకు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మర్రి శశిధర్‌రెడ్డి… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే పరువునష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం శశిధర్‌‎రెడ్డికి ఆయన లీగల్‌ నోటీస్‌ పంపారు.

    Trending Stories

    Related Stories