International

ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు భారీ నష్టం.. ఎంతంటే..!

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. సేవల పునరుద్ధరణకు చాలానే కష్టపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సేవలు నిలిచిపోవడంపై ఫేస్‌బుక్ క్షమాపణలు తెలిపింది. తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ క్షమాపణలు తెలియజేశారు. అంతరాయానికి చింతిస్తున్నట్టు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ సేవలపై ఎంత ఆధారపడ్డారో తమకు తెలుసని అన్నారు. అయితే ఇలా నిలిచిపోవడంతో జుకర్ బర్గ్ కు భారీ నష్టం వాటిల్లింది. జుకర్ బర్గ్ 700 కోట్ల డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. మన కరెన్సీలో ఆయన నష్టం సుమారు రూ.52,126 కోట్లు. కేవలం కొన్ని గంటల అంతరాయంతో ఆయన తన ఆస్తిలో అంత పోగొట్టుకున్నారు. కుబేరుల జాబితాలో ఆయన మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. 12,160 కోట్ల డాలర్ల సంపద ఉన్న జుకర్ బర్గ్.. బిల్ గేట్స్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ లలో అంతరాయం కారణంగా చాలా సంస్థలు ప్రకటనలను విరమించుకున్నాయి. దీంతో సంస్థ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి.

Related Articles

Back to top button