NH Opinion

మరాఠాల కత్తివేటుతోనే టిప్పు సుల్తాన్ లో మార్పు..!

టిప్పు సుల్తాన్ లో మార్పునకు కారణం మరాఠాలేనని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. వారి కత్తి వేటు తర్వాతే అతని గర్వభంగం అయ్యిందని అంటారు. ఆ తర్వాత తన రాజ్యంలో అధికసంఖ్యాలు అయిన హిందువులతో సఖ్యతగా ఉంటేనే ఇక తన రాజ్యమనుగడ సాధ్యమనే విషయం అతనికి అవగతమైందంటారు. అందుకే ఆయన శృంగేరి శంకరాచార్యులతో సత్సంబంధాలను నెలకొల్పుకున్నాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.

క్రీ.శ. 1782 – 1792 వరకు తన పదేళ్ల కాలంలో విపరీతమైన ఇస్లామ్ మతోన్మాదంతో రెచ్చిపోయాడు టిప్పు! మరాఠాల చేతికి చిక్కిన తర్వాత అతని గర్వమంతా అణగిపోయింది. అటు మరాఠాలకు , ఇటు బ్రిటీష్ వారికి సంధి షరతుల ప్రకారం…హిందువుల నుంచి దోచుకున్న సొమ్మునంతా అప్పగించాల్సి వచ్చింది. తన రాజ్యంలో అధిక సంఖ్యాకులైన హిందువుల విశ్వాసాన్ని చూరగొనాల్సిన అవశ్యకత ఏర్పడింది. హిందువుల ఆగ్రహానికి గురైతే…, అటు మరాఠాల నుంచి తన ఉనికికే ప్రమాదం ఏర్పాడుతుందని తొలిసారిగా గ్రహించాడు. ఇక ఆనాటి నుంచి హిందువులను మచ్చిక చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని మరికొంతమంది చరిత్రకారులు చెప్పే మాట..!

దక్షిణ భారతంలో…ముఖ్యంగా కర్ణాటకలో హిందువుల ప్రముఖ శ్రద్ధా కేంద్రమైన శృంగేరి మఠానికి ఎన్నో కానుకలను టిప్పు సుల్తాన్ సమర్పించాడు. శృంగేరి మఠానికి టిప్పు కానుకలు ఇవ్వడం వెనుక పరమత సహనం..హిందు మతం పట్ల అభిమానం కాదని.., ఇదంతా రాజకీయ కోణంలో ఒక భాగమని హిందుత్వవాదులతోపాటు, కొంతమంది జాతీయవాద మేధావుల వాదిస్తారు! టిప్పు సుల్తాన్ పరమత సహనం ఉన్న పాలకుడు అయితే తన రాజ్యంలోని లెక్కలేనన్ని హిందూ దేవాలయను ఎందుకు విధ్వంసం చేయించాడని వారు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు ఎందుకు లక్షల సంఖ్యలో హిందువులను మతం మార్చాడు? ఇంకా చెప్పాలంటే… తన రహస్య లేఖలలో టిప్పు సుల్తాన్ హిందువులను కాఫిర్లు గా సంబోంధించేవాడు. టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారికి ఎదురు తిరిగింది దేశభక్తితో కాదని…, దక్షిణ భారత దేశానికి తానే చక్రవర్తి కావాలని యుద్ధాలు చేశాడు. అంతేకాదు నిజానికి టిప్పు తన రాజ్యంగా ప్రకటించుకున్న మైసూర్ ఒకప్పుడు హిందూ రాజ్యం! టిప్పు తండ్రి హైదర్ ఆలీ…నమ్మకద్రోహంతో హస్తగతం చేసుకున్నదే! టిప్పు సుల్తాన్ లో నిజంగా పరమత సహనం ఉంటే ఎందుకు తన రాజ్యంలో హిందూ పేర్లతో ఉన్న ప్రాంతాలకు ముస్లిం పేర్లు పెట్టాడని కొంతమంది జాతీయవాద చరిత్రకారులు ప్రశ్నలు లెవనెత్తుతున్నారు.

మంగళూరును టిప్పు జలాలా బాద్ గాను, కాన్ననోరే- కణ్వపురాన్ని కుసనాబాద్ గా , బెపూర్ ను సుల్తానపట్టణంగాను, మైసూరును నజారాబాద్ గా, రత్నగిరిని ముస్తాఫబాద్ గా, దిండిగుల్ ను ఖలికబాద్గా, కాలికట్ ను ఇస్లామాబాద్ గా మార్చేశాడు. టిప్పు మరణించాకే ఈ ప్రాంతాల అసలు పేర్లు తిరిగి వాడకలోకి వచ్చాయి.

అలాగే రాజా వర్మ అనే చరిత్రకారుడు తన “హస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ కేరళ “గ్రంథంలో…టిప్పు హిందూ దేవాలయాల మీద చేసిన దాడిని గురించి చెబుతూ…గజనీ మహహ్మద్ కన్నా క్రూరుడిగా టిప్పును అభివర్ణించాడు. కోజికోడ్ లోని తాలి, తిరువంనుర్, వరచ్కల్ పుత్తూర్, గోవిందాపురం, తలిక్కున్ను దేవాలయాల్ని టిప్పు ధ్వంసం చేయించాడు.తర్వాత కాలంలో అటు బ్రిటీష్ వారితో, ఇటు మరాఠాలతో ఓటమితో తప్పనిసరి పరిస్థితుల్లో హిందువుల పట్ల ఔదార్యం ప్రదర్శించినట్లు నటించాడని అంటారు. టిప్పు ముందు నుంచి కూడా ఇస్లామ్ మతోన్మాదేనని కొంతమంది మేధావులు చెబుతుంటారు.

అంతేకాదు టిప్పు సుల్తాన్ జన్మదినంగా నవంబర్ పదో తేదీన…కాంగ్రెస్ వాదులు ప్రారంభించిన జయంతి ఉత్సవాలను వెనుక కూడా కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చరిత్రపరంగా.. టిప్పు పాలనలో అదే నవంబర్ 10న కర్ణాటకలోని కూర్గ్లో నివసించే మేల్కొటే బ్రాహ్మణులను, అయ్యంగార్లను టిప్పు సుల్తాన్ దారుణంగా వధించాడు. తాను ఎలా మలబారు కు చెందిన నాయర్ల కుటుంబాలను మతం మార్చింది…వారిని సమూలంగా నిర్మూలించాలని చూసిన వైనాన్ని వివరాలతో స్వయంగా టిప్పుయే లేఖ రూపంలో, తన పేర గ్రంథం రూపంలో రాసుకున్నాడు.ఈ వివరాలకు సంబంధించి క్రీ.శ. 1750- 1799 వరకు టిప్పు జీవించిన కాలానికి సంబంధించిన లేఖలను, గ్రంథాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

లౌకికవాదం పేరుతో విలన్లను సైతం నేషనల్ హీరోలుగా చూపెట్టాలనే ప్రయత్నం…దేశహితానికి మంచికాదు..! ఇది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం..! హిందువుల సెంటిమెంట్ తో ఆడుకున్న పాలకులందరూ ఆ తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయినవారే..! ఈ విషయాన్ని మన పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 + 19 =

Back to top button