ఏవోబీలో మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

0
703

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల‌కు చెందిన ప‌క్కా స‌మాచారం రావ‌డంతో మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు క‌టాఫ్ ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఏవోబీలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లాలోని జొడొంబో ప‌రిధిలోని కుసుముపుట్టు అట‌వీప్రాంతంలో భారీ డంప్‌ను పోలీసులు గుర్తించారు. ఈ డంప్‌లో ఆయుధాలతో పాటు భారీ పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో 303 ర‌కం తుపాకులు-3, గ్యాస్ గ‌న్‌లు-2, దేశ‌వాళీ తుపాకులు-4, మందుపాత‌ర‌లు-2, గ్రనెడ్లు-2, డిటోనేట‌ర్లు-20తో పాటు భారీ ఎత్తున పేలుడు సామాగ్రి, విప్ల‌వ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ మావోయిస్టు క్యాడ‌ర్‌కు చెందిన‌దిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు సామాగ్రి, ఆయుధాల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ డంప్‌ను ఉంచిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గాలింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen − 9 =