More

  కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఊహించని షాక్..!

  దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతూ ఉంది. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘర్, తెలంగాణ తరువాత, మణిపూర్‌ లో కూడా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు మొదలై తారా స్థాయికి చేరుకున్నాయి. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజమ్ తన పదవి నుంచి తాజాగా వైదొలిగారు.మాజీ మంత్రి, బిష్ణుపూర్ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్ విప్ గా ఉన్నారు. గోవిందాస్ కొంతౌజమ్ తో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కీలక పరిణామం.

  గోవిందాస్‌ కొంతౌజమ్‌ ను గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ అనూహ్యంగా పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం మణిపూర్ లో భారతీయ జనతా పార్టీ వైపు 24 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ వైపు 17 మంది మాత్రమే ఉన్నారు. రాబోయే రోజుల్లో మణిపూర్ కాంగ్రెస్ ను మరింత మంది నాయకులు వీడుతారనే ప్రచారం కూడా సాగుతోంది.

  ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వానిదే మెజారిటీ
  2020 ఆగస్టు 10 న అసెంబ్లీలో ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీ సాధించింది. జూన్ 17న రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని అంతం చేసింది. ఉప ముఖ్యమంత్రి సహా 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి తరలించిన ట్రస్ట్ మోషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి పార్టీ విప్ జారీ చేసినప్పటికీ 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ చర్యలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీలో నలుగురు ఎన్‌పిపి ఎమ్మెల్యేలతో సహా 28 మంది సభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు.

  Trending Stories

  Related Stories