ఉమైర్ సంధు బండారం బయటపెట్టిన సుహాసిని

0
1058

ఉమైర్ సంధు.. సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకుంటూ ఉంటాడు. అందులో ఏ మాత్రం క్లారిటీ ఉండదు. ఎంతో చెత్త సినిమాలను సైతం అద్భుతం అని పొగిడేస్తూ ఉంటాడు. ఇతడు కొందరి కోసం పని చేస్తుంటాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. మంచి సినిమాలను నచ్చలేదని చెబుతూ.. తొలి రివ్యూ తనదేనని చెబుతూ సోషల్ మీడియాలో అంతో ఇంతో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తాజాగా అతడు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.

మణిరత్నం పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, జయం రవి, కార్తీ తదితరులు నటించారు. సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఉమైర్ సంధు తన నకిలీ రివ్యూలపై సుహాసిని మణిరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ హిందీ , సౌత్ చిత్రాలను సమీక్షించే ‘ఓవర్సీస్ ఫిల్మ్ క్రిటిక్’ అని ఉమైర్ పేర్కొన్నాడు. భారతదేశంలో విడుదలయ్యే ముందు అతను సినిమాలకు రివ్యూలు ఇస్తూ ఉంటాడు.

దుబాయ్‌ సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుడినంటూ చెప్పుకునే ఉమైర్‌ సంధూ తొలి రివ్యూని ఇచ్చాడు. అది చూసిన మణిరత్నం భార్య, నటి సుహాసిని అతడిపై ఫైర్‌ అయ్యారు. పొన్నియన్‌ సెల్వన్‌ ఫస్ట్‌ రివ్యూ ఇదేనంటూ ఉమైర్‌ ట్వీట్‌ చేశాడు. ‘అద్భుతమైన సినిమాట్రోగాఫి, అంతకుమించిన ప్రొడక్షన్‌ డిజైన్‌, విఎఫ్‌ఎక్స్‌! చియాన్‌ విక్రమ్‌, కార్తి తమ నటనతో వావ్‌ అనిపించారని పొగిడాడు. ఐశ్వర్యరాయ్‌ మంచి కంబ్యాక్‌ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. సినిమా ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకుల చేత క్లాప్‌ కొట్టించడం ఖాయమని చెప్పాడు. “First Review #PS1 ! Amazing Cinematic Saga with Terrific Production Designing & VFX ! #ChiyaanVikram & #Karthi Stole the Show all the way. #AishwaryaRaiBachchan is Back & looking Stunning ! Overall, A Decent Historical Saga with some twists & Clap worthy moments.”

ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌ కావడంతో సుహాసిని కంట పడింది. అతడి రివ్యూపై స్పందిస్తూ.. ఇంతకి నువ్వు ఎవరు? అంటూ అసహనం వ్యక్తం చేసింది ఆమె. ‘అసలు మీరు ఎవరు?.. ఇంకా విడుదల కాని సినిమాను మీరు ఎలా చూశారు’(“Who is this please. What is your access to a film yet to release”) అంటూ సుహాసిని అతడిని ప్రశ్నించారు.