More

    మంగళూరు బ్లాస్ట్.. ముమ్మాటికీ తీవ్రవాద చర్యనే

    మంగళూరులో ఆటో రిక్షా లో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరగలేదని.. అది కచ్చితంగా ఉగ్రవాదుల కుట్రలో భాగంగానే జరిగిందని డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పేలుడు ద్వారా తీవ్రంగా నష్టం కలిగించేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర పోలీసులు దీనిపై కేంద్ర సంస్థలతో కలిసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారని సూద్ ట్వీట్ చేశారు. ‘‘నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు’’ అని డీజీపీ చెప్పారు. వాహనం పేలడంతో ఆటోరిక్షా డ్రైవర్‌, ప్రయాణికుడికి గాయాలయ్యాయి.

    కుక్కర్‌‌లో IEDని ఉంచడం వల్లే శనివారం మధ్యాహ్నం బ్లాస్ట్‌ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఆటోలో కుక్కర్‌తో ఉన్న బ్యాగ్‌ తీసుకెళ్తోంది ప్రేమ్‌రాజ్‌గా గుర్తించారు. అతని పేరు, ఆధార్‌ కార్డ్‌, అడ్రస్ అన్నీ ఫేక్‌ అని తేల్చారు. నెల కిందటే మైసూర్‌లో నకిలీ డాక్యుమెంట్లతో ఇతను ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ రెంటల్‌ డాక్యుమెంట్‌లో ఇచ్చిన హుబ్లీ చిరునామా కూడా ఫేకే అని గుర్తించారు. ప్రేమ్‌రాజ్‌ పేరుతో ఇతను ఇవన్నీ ఎందుకు క్రియేట్‌ చేసుకున్నాడు.. అతని వెనుక ఎవరు ఉన్నారు అనేదానిపై ఇప్పుడు NIA దృష్టి పెట్టింది.

    Trending Stories

    Related Stories