Bharateeyam

దుష్టులను శిక్షించిన మంగళూరు కొరగజ్జ శివయ్య

దేవుడున్నాడు..! తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు..! ఇది నిజం. ! ఏమీటి దువ్వాడ…! జాతీయవాద అంశాల నుంచి దేవుడు..,దుష్టశిక్షణ వంటి విషయాలపై మళ్లాడని మీరు అనుకుంటున్నారా? అవును… విషయం అలాంటిది మరి.!

ఆ ముగ్గురు దుర్మార్గులు చేసిన పనికి నా రక్తం ఉడికిపోయింది.! కోపం వచ్చింది.! పవ్రిత హైందవ ధర్మంపై, హిందూ సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలపై ఇంకా ఎన్నాళ్ళు ఈ దాడులు? అంటూ ఆవేదన..! పాపభీతి అనేది ఒకటి ఉంటుంది.! ఆ దుర్మార్గులకు తాము పాపం చేస్తున్నామనే భయం లేదా? పాపం చేసిన దుర్మార్గులకు శిక్షలు లేవా? వారిని శిక్షించేవారే లేరా? అంటూ ఆవేశం ఒకవైపు..! ఆ వెంటనే ఏవడి పాపం వాడి వెంటే..! అనే కాసింత ఊరడింపు తో నా మనస్సును నేను కుదటపర్చుకున్నాడు.

నేను చెబుతున్నది కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు కొరగజ్జ పరమశివుడి ఆలయం అపవిత్రం చేసిన ఘటన గురించి.! నవాజ్, తౌఫీక్, అబ్దుల్ రహీం అనే ముగ్గురు పవిత్రమైన కొరగజ్జ దేవాలయాన్ని అపవిత్రం చేయాలని కుట్ర పన్నారు. హుండీలో కండోమ్స్ వేశారు. అలాగే తౌఫిక్ అనేవాడు మూత్ర విసర్జన కూడా చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు..! గ్రామ దేవాలయాలను మొదలు పెడితే పేరు ఆలయాలను అపవత్రం చేయడమే వీరు పనిగా పెట్టుకున్నారు. ప్రజలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎప్పటిలాగే ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నాం. దోషులను పట్టుకుంటామని స్టేట్ మెంట్ ఇచ్చారు. మూడు రోజులు గడిచిపోయాయి.

కొరగజ్జ స్వామిని మంగళూరు ప్రజలు పరమ శివుడి అవతారంగా పూజిస్తారు. పవర్ ఫూల్ దేవుడిగా అక్కడి ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. తమ దైవం కొలువైనా ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఎంతో వేదనకు గురయ్యారు. కొందరు భక్తులతే.. ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆ శివయ్య ఎదుటే మౌన దీక్ష చేశారు. తనను నమ్మకున్న భక్తుల కోసమే అన్నట్లుగా ఆ శివయ్య.. తన ఆలయాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులకు తగిన బుద్ది చెప్పాడు . ఇదంతా కూడా తర్కానికి..లాజిక్కు అందని విషయం. కానీ ఇది నిజం.! కొన్ని విషయాలను తర్కించకుండా నమ్మేయాల్సిందే.

హిందూ ఆలయాలను అపవిత్రం చేసే కుట్రలో ప్రధాన నిందితుడైన నవాజ్…, స్వామివారి ఆలయాన్ని అపవిత్రం చేసిన మూడు రోజులకు పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. రక్తం కక్కుకోవడంతోపాటు రక్త విరోచనాలు అయ్యాట. రోధిస్తూ తన తలను తానే గోడలకు బాదుకున్నాడు. చనిపోయే ముందు మనం పాపం చేశాం..!  కొరగజ్జ స్వామి మన మీద ఆగ్రహించాడని తన ఇద్దరు మిత్రులు తౌఫీక్, అబ్దుల్ రహీంలకు చెప్పి మరణించాడు. అతను మరణించిన తర్వాత ఈ ఇద్దరు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తమ తప్పు తెలుసుకుని, తమను క్షమించమని, నేరుగా ఆ దేవుడి సమక్షంలోనే కోరారు. పూజారికి తాము చేసిన అపరాధం గురించి వివరించారు. అయితే మొదట వారు చెప్పిన మాటలను పూజారి కూడా విశ్వసించలేదు. అయితే హూండీలో కండోమ్స్ వేసిన విషయం గురించి చెప్పడంతో ఆయన నిందితులు ఆలయంలోనే ఉన్నారంటూ పోలీసులకు సమాచారం చేరవేశాడు.

దీంతో  నిందితులు అబ్దుల్ రహీం, అబ్దుల్ తౌఫిక్ లను  పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 123 ఏ ప్రకారం వారిపై కేసు నమోదు చేశారు. అయితే మంగళూరు పోలీసులు…ఈ కేసును విచిత్రమైనదిగా చెబుతున్నారు. నిందితులు తాము చేసిన నేరం ఒప్పుకున్నారని, వారిలో ఒకడు మరణించాడని, వీరు చెబుతున్నది నిజమా? కాదా ? అని నిర్ధారణ చేసుకునేందుకు తగిన సాక్ష్యాధారాలతోపాటు, సీసీటీవీ ఫూటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. వీరు ఇలా పలు దేవాలయాలను అపవిత్రం చేసినట్లు చెప్పడంతో ఆయా పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫూటేజీని సైతం సేకరిస్తున్నారా?

సో… దేనికైనా టైమ్ ఉంటుంది..! ఇన్నాళ్లు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా.. చేవచచ్చి మౌన ప్రేక్షకులుగా మారిన హిందువులను చూసి..ఆ దేవుడే జాలి పడ్డాడో లేక.., నా భక్తులైనా హిందువులు  మరి ఇంత పిరికివాళ్ళా అనుకున్నాడేమో తెలియదు కానీ స్వయంగా ఆ దేవుడే రంగంలోకి దిగాడు. దుష్టశిక్షణ మొదలు పెట్టాడు. హిందువులారా ఇప్పటికైనా మేల్కొనండి. ధర్మరక్షణకు నడుం కట్టండి.!   

Leave a Reply

Your email address will not be published.

18 − 14 =

Back to top button