యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే కార్యక్రమం.. రివాల్వర్ తో వచ్చిన వచ్చిన వ్యక్తి

0
660

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరు కావాల్సిన బస్తీ జిల్లా కార్యక్రమానికి ఒక వ్యక్తి రివాల్వర్ తో వెళ్లడం కలకలం రేపింది. అతడు రివాల్వర్ తీసుకెళ్లడంతో నిర్లక్ష్యం వహించినందుకు 7 మంది పోలీసులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ హాజరు కావడానికి 40 నిమిషాల ముందు నిందితుడు తన రివాల్వర్‌తో వచ్చాడు. అతను ఆడిటోరియంలోకి ప్రవేశించిన వెంటనే, అతడిని పోలీసులు బయటకు పంపించివేశారు. బస్తీ జిల్లాలో నియమించబడిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.. మరో ముగ్గురు పోలీసులపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

బస్తీ జిల్లా ఎస్పీ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “బస్తీ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఆయన రావడానికి 45 నిమిషాల ముందు, ఒక వ్యక్తి తన లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో ఆడిటోరియానికి వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న సర్కిల్ ఆఫీసర్ అతడిని చూసి వెంటనే ఆడిటోరియం నుండి బయటకు తీసుకువెళ్లారు. అతని గుర్తింపు నిర్ధారించబడింది. ముఖ్యమంత్రి, పలువురు వీఐపీల ల్యాండింగ్‌కు 40 నిమిషాల ముందు ఇదంతా జరిగింది. ప్రాథమిక విచారణలో బస్తీ జిల్లాలో 4 మంది పోలీసులతో సహా 7 మంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది” అని చెప్పుకొచ్చారు. బస్తీ జిల్లాలో నియమించబడిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.. మిగిలిన ముగ్గురు పోలీసులకు సంబంధించి సంబంధిత ఎస్పీలకు నివేదికలు పంపబడ్డాయి. శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు యోగి ఆదిత్యనాథ్ సమాయత్తమవుతూ ఉన్నారు. అక్టోబర్ 1 నుండి వారంలో 4-5 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎన్నికలకు ముందు అన్ని జిల్లాలలో పర్యటించబోతున్నారు. తన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి ఆదిత్యనాథ్ ప్రజల ఇళ్లను సందర్శిస్తారు. 403 సీట్ల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరగనున్నాయి.