More

    1,640 కిలోమీటర్ల దూరం విమానం టైర్ల మధ్య దాక్కుని వెళ్ళాడు..

    కొద్దిరోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి ప్రజలు ఎన్నో మార్గాలను అన్వేషించారు. ఆఖరికి విమానం టైర్ల మధ్య కూడా దాక్కుని వచ్చేయాలని అనుకున్నారు. కొందరు ల్యాండింగ్ గేర్ దగ్గర దాచుకుని ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి వెళ్లిపోవాలని అనుకోగా.. వాటి మధ్యనే నుజ్జు నుజ్జు అయ్యారు. ఇంకొందరేమో వీలైనంత వరకూ వేలాడి.. ఆ తర్వాత పట్టు చిక్కక విమానాశ్రయంకు దగ్గరగా ఉన్న ఇళ్లపై పడ్డారు. టైర్ల మధ్య నుండి దాక్కుని వచ్చి ప్రయాణం చేయాలని అనుకోవడం ఎంతో కష్టమైనది.. రిస్క్ తో కూడుకున్నదని అందరికీ తెలిసింది.

    గ్వాటెమాలా మెక్సికోను ఆనుకుని ఉన్న చిన్నదేశం. దీని రాజధాని గ్వాటెమాలా సిటీ. ఇక్కడ్నించి అమెరికాలోని మయామీ నగరానికి సుమారు 1,640 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద దాక్కుని గ్వాటెమాలా సిటీ నుంచి మియామీకి వచ్చేశాడు. గత శనివారం మయామీ ఎయిర్ పోర్టులో గ్వాటెమాలా సిటీ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండైంది. ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవుతుండగా, ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి ఎయిర్ పోర్టు సిబ్బంది షాక్ అయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. గ్వాటెమాలా నుంచి విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని వచ్చానని వెల్లడించాడు. ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా ల్యాండింగ్ గేర్ వద్ద దాక్కుని దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించడం పట్ల సిబ్బంది విస్మయానికి గురయ్యారు. ఎయిర్ పోర్టు సిబ్బంది ఫిర్యాదుతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఆసుపత్రికి తరలించారు. అక్రమ వలసదారుడిగా భావిస్తున్నారు.

    Trending Stories

    Related Stories