More

    రోటీలపై ఉమ్మివేసిన.. 5 మందిని అరెస్టు చేసిన పోలీసులు

    దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది. లక్నోలో ఉమ్మి వేస్తూ ఓ వ్యక్తి రోటీని తయారుచేసే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి డాబా వద్ద ఉమ్మివేస్తూ తందూరీ రోటీని వండుతున్నట్లు కనిపించింది. ఆ వ్యక్తి చేసిన ఈ పనిని ఎవరో కెమెరాలో బంధించి వైరల్ చేశారు. ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్న ఈ వీడియోలో పోలీసుల వరకు చేరింది. ఉమ్మివేసి రోటీని తయారు చేస్తున్న ఈ వీడియో లో ఇమామ్ అలీ హోటల్ కు సంబంధించిందని తేలింది. ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కకోరి పోలీసులు హోటల్ యజమాని యాకూబ్, అతని నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో విషయమై పోలీసులు మరింత సమాచారం రాబడుతూ ఉన్నారు.

    వైరల్ వీడియోలోని వ్యక్తి రోటీ వండుతూ ఉండగా.. అతని దగ్గర మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తి రోటీలో ఉమ్మివేసి, ఆపై వండడానికి తందూరీ మేకర్ లో పెట్టాడు. ఈ వీడియోను చాలా దూరం నుండి ఎవరో రహస్యంగా కెమెరాలో బంధించారు. రికార్డు చేయడానికి కారణంగా తెలియకపోయినా.. రోటీపై ఉమ్మివేయడం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతకుముందు యుపిలోని మీరట్‌లో నిశ్చితార్థం కార్యక్రమం సమయంలో ఉమ్మివేస్తూ రోటీని తయారుచేసే వీడియో వైరల్‌గా మారింది. గతేడాది డిసెంబర్‌లో మీరట్‌లోని కంకర్‌ఖేడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమంలో తాండూర్‌ వంటగాడు నౌషాద్‌ ఉమ్మివేస్తూ రోటీ తయారు చేస్తూ కనిపించాడు. ఈ ఘటన తర్వాత అతడిని అరెస్టు చేశారు. ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు ఇలాంటివి వైరల్ అయ్యాయి.

    Trending Stories

    Related Stories