37వ సారి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. 28 మంది భార్యలు, 35 మంది సంతానం ఉన్నారు. 126 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. 28 మంది భార్యలు, కుటుంబ సభ్యుల ముందు అతడు పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ లో 45 సెకండ్ల నిడివిగల ఈ వీడియోను పోస్ట్ చేశారు. జీవించి ఉన్న అత్యంత సాహసి..28 మంది భార్యల ఎదుట 37వ వివాహం అంటూ వీడియోను పోస్టు చేశారు. వీడియోను ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు తెలియరాలేదు. ఇక తాత గారి భార్యల బాగోతం చూసి నెటిజన్లు తలో రకంగా కామెంట్లు చేశారు.
ఈ వీడియో వైరల్ అయ్యే వరకు 21 వ శతాబ్దంలో కూడా ఇలాంటి వ్యక్తుల గురించి మనకు తెలియలేదు. ఇది వికారమైన జీవనశైలికి అద్దం పడుతుందని పలువురు విమర్శలు వస్తున్నాయి. తన జీవితాన్ని గడపడానికి అతను ఎంచుకున్న విధానాన్ని పలువురు తప్పులు పడుతూ ఉన్నారు. చాలా మంది భార్యలు మరియు పిల్లలతో మనిషి ఎలా బ్రతుకుతున్నాడోనని చాలా మంది షాక్ అయ్యారు. అతని వింత జీవనశైలిని కొందరు విమర్శించారు.
ఇలాంటివి వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. 2020 లో, తైవాన్‌కు చెందిన ఒక వ్యక్తి 37 రోజుల వ్యవధిలో ఒకే స్త్రీని నాలుగు సార్లు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నట్లు వార్తలు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక జింబాబ్వేలో 16 మంది భార్యలు, 151 మంది పిల్లలు ఉన్న ఒక వ్యక్తి 17 వ భార్యను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. జింబాబ్వేకు చెందిన మిషెక్ న్యాన్డోరో, 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ అనుభవజ్ఞుడు ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నాడు.