అమెరికాలో మరోసారి కాల్పులు.. కాల్పులు జరిపింది ఎవరో తెలుసా..?

0
790

అమెరికాలో కాల్పుల ఘటనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. దేశంలో నానాటికి గన్‌కల్చర్‌ పెరిగిపోతోంది. క్రమం తప్పకుండా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటూనేవున్నాయి.

తాజాగా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్ డీసీలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలుడు చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒక పోలీస్‌ అధికారి కూడా ఉన్నారు. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. అటు ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు ఏటీఎఫ్ కూడా రంగంలోకి దిగింది. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలవగా.. అందులో ఒక పోలీస్‌ అధికారి కూడా ఉన్నారు. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

ఈనెల 9న పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో నానాటికీ గన్‌కల్చర్‌ అధికమవుతోంది. నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్‌, టెక్సాస్‌, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో రెండంకెల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. ఒక్క టెక్సాస్‌ ఘటనలోనే 22 మంది మృతి చెందడమ గమనార్హం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 − 1 =