More

    తెలుగు సినిమాను 25 సార్లు చూసి.. ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని..!

    ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూసిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని భావించాడు. సెల్ఫీ వీడియోను తన తండ్రికి పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఈ ఘటన కర్నాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మధుగిరి సమీపంలో ఒక గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్‌ (23) ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు. తన గ్రామంలోనే ఖాళీగా ఉండేవాడు. బయటకు వెళ్లే వాడు కాదు.. ఇంట్లోనే ఉంటూ చాలా ఏళ్ల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూశాడు. అందులో ఉన్నది ఉన్నట్లుగానే తన జీవితంలో కూడా జరుగుతుందని భావించాడు. తన గ్రామశివార్లలో 20 లీటర్ల పెట్రోలును ఒంటిపై పోసుకుని ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతున్నానని చెబుతూ సెల్‌ఫోన్‌లో సెల్ఫీవీడియో తీసుకున్నాడు. తన తండ్రికి పంపించి తరువాత నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని రక్షించి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుకా ప్రసాద్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని.. పునర్జన్మ ఉండదని రేణుకా ప్రసాద్‌ విశ్వసించాడని గ్రామస్థులు చెబుతున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories