More

    సికింద్రాబాద్ విధ్వంసంలో బయటపడ్డ కుట్ర కోణం.. అతడే కారణమా..?

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావు పేటలో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    పక్కా ప్రణాలికతోనే విధ్వంసాన్ని రచించారు. అభ్యర్థులను సుబ్బారావు కావాలనే రెచ్చగొట్టారు. ప్రైవేటు అకాడమీల సహకారం తోనే విద్వంసానికి పాల్పడ్డారు విద్యార్థులు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ కి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారని తేల్చేశారు. విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను కొన్ని ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సరఫరా చేశాయి. పది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మూడు రోజుల క్రితం ఆర్మీ పరీక్ష క్యాన్సిల్ అయిదంటూ యూట్యూబ్ లో వీడియోలను ఆవుల సుబ్బారావు పోస్టు చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories