More

  సరయూనదిలో సరసాలు.. బడితెపూజ చేసిన భక్తులు..!

  ప్ర‌పంచం ఇప్పుడు చిన్న‌దై పోయింది. టెక్నాల‌జీ పెరిగింది. ఎప్పుడు ఎవ‌రు కెమెరా క్లిక్ మ‌నిపిస్తారో చెప్ప‌లేం. ఎక్క‌డ ఏ స్పై కెమెరా ఉందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండాల్సినవ‌న్నీ ఇప్పుడు బ‌హిరంగంగా చేసేస్తున్నారు.

  చుట్టూ జ‌నం ఉన్నార‌న్న ధ్యాస మ‌రిచి పోయి వ్య‌వ‌హ‌రిస్తే ఎలాంటి ఇబ్బంది త‌లెత్తుతుందో ఈ స‌న్నివేశం చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం పిచ్చకొట్టుడు కొట్టారు. భార్యముందే భర్తకు నాలుగు మొట్టికాయలు తగిలించారు. కట్టుకున్న భార్యకు ముద్దు పెట్టడంలో తప్పేంముందనే కదా మీ డౌట్. అసలేం జరిగిందో చూడండి. కట్టుకున్న భార్యకు కాకుండా మరో మహిళకు ముద్దు పెడితే తప్పుకానీ… భార్యకు ముద్దు పెడితే తప్పేంటి అంటారా..? అతను ఏ ప్రదేశంలో ఇలాంటి పని చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయు నదిలో ముద్దు పెట్టుకున్న భర్తను జనంగా మామూలుగా కొట్టలేదు. భార్యముందే భర్తను చితక్కొట్టారు. సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అదే సమయంలో ఓ జంట స్నానం చేసేందుకు నదిలోకి దిగింది. ఆ జంటకు సడెన్ గా ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ అంతా చూస్తుండగానే ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఇలా చేయడంతో వారు ఎంత ఆనందాన్ని పొందారో తెలియదు కానీ.. చుట్టుపక్కల వాళ్లకు మాత్రం పిచ్చ కోపం వచ్చింది. ఆ జంట చర్యతో వారికి మండింది. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

  ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటారా…అంటూ భర్తను ఉతికి పారేశారు. దీంతో ఆ జంట బిత్తరపోయి చూడటం తప్పా ఏం చేయలేకపోయింది. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. భార్య ఎంత బతిమిలాడినా… జనాలు భర్తను విడిచిపెట్టకుండా కొట్టారు. అయోధ్య‌లో ఇలాంటి అశ్లీలాన్ని సహించ‌బోమ‌ని హెచ్చరించారు. దీంతో ఆ జంట ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా వాళ్ల పిచ్చి కాకుంటే ముద్దు పెట్టుకోవడానికి పబ్లిక్ ప్లేస్.. అందులోనూ పుణ్యక్షేత్రమే దొరికిందా…? మీ సరసానికి అడ్డు అదుపు లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  గతేడాది కూడా ఇలాంటి ఒకటి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పవిత్ర కృష్ణ నదిలోకి దిగిన ప్రేమ జంట హద్దుమీరి ప్రవర్తించింది. నదిలోనే సరసాలు మొదలు పెట్టారు. ఇది కాస్త అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తుల కంటపడింది. తొలుత ఆ ప్రేమ జంటను నదిలో నుంచి బయటకు వెళ్లాలని అక్కడి వారు హెచ్చరించారు. వారి హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోని ఆ లవర్స్ మరింత మితిమీరి ప్రవర్తించడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువతి బయటకు వెళ్దామని చెప్పినా వినని ప్రేమికుడు మరింత రెచ్చిపోవడంతో ఆ యువకుడికి అక్కడి భక్తులు బడితే పూజ చేశారు. వారి దెబ్బలు తాళలేక యువకుడు అమ్మాయిని కూడా వదిలి పారిపోయాడు.

  Trending Stories

  Related Stories