More

    పఠాన్ సినిమాను అడ్డుకుంటామన్న వ్యక్తి అరెస్ట్.. అతనెవరో తెలుసా..?

    బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ నటిస్తున్న పఠాన్ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా పాట విడుదలైనప్పటి నుండే వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. సినిమాను విడుదల చేయనివ్వమని.. అశ్లీలత సినిమాలో తారాస్థాయికి చేరుకుందని పలువురు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని హెచ్చరించారు. అలా హెచ్చరించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ‘పఠాన్’ సినిమాని విడుదల చేయవద్దని థియేటర్ యజమానులను బెదిరించిన 33 ఏళ్ల వ్యక్తిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని సన్నీ షా అలియాస్ తౌజీగా గుర్తించారు. ‘పఠాన్‌’ని విడుదల చేయవద్దని థియేటర్‌ యజమానులను బెదిరిస్తూ వీడియోను ఇటీవల విడుదల చేశాడు. పోలీసు అధికారుల ప్రకారం, నిందితుడి వ్యాఖ్యల కారణంగా మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. షా వీడియోను గుజరాత్‌లోని పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ఏదైనా థియేటర్ యజమాని పఠాన్‌ సినిమాను ఆడించాలని నిర్ణయించుకుంటే, ఆ థియేటర్లకు నిప్పు పెడతారని షా వీడియోలో చెప్పారు.

    మీడియాలో వచ్చిన నివేదికల ద్వారా అహ్మదాబాద్ సైబర్ పోలీసులు ఆ వీడియోను కనుగొన్నారు. తర్వాత షాను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షా గతంలో కర్ణి సేన సభ్యుడు. పోలీసు అధికారులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ యజమానులను బెదిరించిన వీడియో క్లిప్‌ను కనుగొన్నారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. జాన్ అబ్రహం విలన్ గా నటించిన పఠాన్ జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ రా ఏజెంట్ గా నటించాడు.

    Trending Stories

    Related Stories