More

    హిందూ దేవుళ్ళను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి.. అదుపులో తీసుకున్న పోలీసులు

    అతడి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూడగా.. హిందూ దేవుళ్ళ గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినవే కనిపిస్తాయి. అతడి తీరును చాలా మంది తప్పు బట్టారు కూడా..! ఇక అతడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.


    మంగళూరు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్ళపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపై 25 సంవత్సరాల స్వలీజ్ ఇక్బాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉల్లాల్ పోలీసు స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేశారు. తోకుట్టు లోని స్మార్ట్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో స్వలీజ్ ఇక్బాల్ నివాసం ఉంటూ ఉన్నాడు. అతడు సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లను తిడుతూ ఇటీవలే వీడియోను పోస్టు చేశాడు. అతడు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికంగా ఉన్న కొందరు ఈ వీడియోను తీవ్రంగా తప్పు బట్టారు. స్థానిక హిందుత్వ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. స్వలీజ్ ఇక్బాల్ మంగళూరు టౌన్ లో ఫర్నీచర్ షాపును నిర్వహిస్తూ ఉన్నాడు.

    Related Stories