హర్ ఘర్ తిరంగాలో భాగంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి ముందు జాతీయ జెండాలను ఎగురవేశారు. అయితే కొందరు దేశ వ్యతిరేకులు కూడా బయటపడ్డారు. చివరికి కటకటాల పాలయ్యారు.
కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో జాతీయ జెండాను సిగరెట్‌తో కాల్చివేసిన దేశద్రోహిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడిని 50 సంవత్సరాల అస్గర్ గా గుర్తించారు. ఈ ఘటన చిక్కమగళూరు నగరంలోని బార్‌లైన్ రోడ్డులో చోటుచేసుకుంది. సిగరెట్ తాగుతూ అస్గర్ అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇంటి ముందు ఉంచిన జాతీయ జెండాను కాల్చాడు. సిగరెట్ తో జాతీయ జెండాకు రంధ్రాలు పెట్టాడు. అతడు చేసిన పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండా చట్టం కింద కేసు నమోదు చేశారు. బార్‌లైన్ రోడ్డుకు చెందిన అస్గర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.