కశ్మీర్ లో 31 ఫోన్లతో పట్టుబడ్డ వ్యక్తి..!

0
246

జమ్మూ కశ్మీర్ లో వ్యక్తి దగ్గర 31 మొబైల్ ఫోన్స్ దొరికాయి. రాజౌరి పట్టణంలోని ఓ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో 31 మొబైల్ ఫోన్లు, 1.16 లక్షల రూపాయల నగదు, రెండు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, పదకొండు గ్రాముల హెరాయిన్ వంటి పదార్థం, ఇతర అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాజౌరి పట్టణంలోని నబ్బన్ మొహల్లా సమీపంలోని 10వ వార్డులో ఉన్న ఇంటిపై డిఎస్పీ హెడ్‌క్వార్టర్ ముదాస్సిర్ హుస్సేన్ నేతృత్వంలోని పోలీసుల బృందం సోదాలు చేపట్టిందని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. అజీజ్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు అని పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో కొన్ని దొంగిలించినవని అనుమానిస్తున్నామని, అయితే మొబైల్ ఫోన్‌లను ఖచ్చితంగా ఎందుకు ఉపయోగిస్తున్నారో దర్యాప్తులో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తి రాజౌరి పట్టణ పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.