More

    ఎలక్ట్రిక్ స్కూటర్ పై ‘దీదీ’.. చలువంతా ‘మోదీ’దే మరి..!

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… బీజేపీకి దీటుగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటా పోటీగా వరుస సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు.బీజేపీ పరివర్తన్ యాత్రకు కౌంటర్ గా…, ఆమె కూడా బెంగాల్ లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే..! బీజేపీ ప్రచార రథం వెనుకాలే ఆమె కూడా పరుగెడుతున్నారు. బీజేపీ సభలు నిర్వహించిన ప్రాంతాల్లోనే ఆ మరుసటి రోజే తృణమూల్ కాంగ్రెస్ కూడా వరుసగా సభలు నిర్వహిస్తోంది.

    అయితే తాజాగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన ఓ ప్రచార స్టంట్..ఆ పార్టీకే పూర్తిగా బెడిసికొట్టింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసగా.., ఓ వినూత్న ప్రదర్శన నిర్వహించాలని మమతా బెనర్జీ తలచింది. దేశంలో పెట్రోల్ ధరలను మోదీ ప్రభుత్వం పెంచేస్తోందని…, ఇక ప్రజలందరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మరాల్సిందే…! అనే రేంజ్ లో ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణించారు. మమతా  చేసిన ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ను…, ఫోటోలను  తృణమూల్ కార్యకర్తలతోపాటు ఆ పార్టీ అనుకూల చానళ్లు ప్రముఖంగా ప్రచారం చేశాయి. ఎన్నికల ముంగిట ఉన్న తమ పార్టీకి… మమతా చేసిన ఈ స్కూటర్ రైడింగ్ బెనిఫిట్ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు సైతం భావించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.

    అయితే….ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మమతా చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ పై నెటిజన్లు మాత్రం తమదైన కామెంట్లతో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజలు మారాల్సిన అవసరం ఉందని…  పీఎం నరేంద్ర మోదీ, అలాగే  కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ గత కొంత కాలంగా అనేక సభలు, సమావేశాలు, కార్యక్రమాల ద్వారా పిలుపునిస్తున్నారు.

    అంతేకాదు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లోనే రూపొందించి ఉత్పత్తి చేసేందుకు మోదీ సర్కార్ పలు పోత్సాహకాలను కూడా అందిస్తోంది. వాయు కాలుష్యంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గిస్తాయని…ఇది పర్యావరణ హితకారి కావడమే కాకుండా…, పెట్రోల్ దిగుమతుల కోసం…,  మన దేశం… విదేశాలపై ఆధారపడకుండా ఇది దోహదం చేస్తుందని.., తద్వార మన దేశానికి విదేశీ మారకం మిగులుతుందని, పెట్రోల్ దిగుమతి కోసం మనం చేసే ఖర్చు తగ్గుతుందని.. ఆ ఖర్చును ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించే వీలుకలుగుతుందని అనేక కార్యక్రమాల్లో పీఎం నరేంద్రమోదీ చెబుతూ వస్తున్నారు. కనీసం 2023నాటి వరకు…దేశంలోని వాహనా తయారీ కంపెనీలు.., ఆ దిశగా తమ యూనిట్లలో మార్పులు చేసుకోవాలని కూడా సూచించింది. మనకు ఇప్పుడు పెట్రోల్ అవసరం లేని రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు రోడ్ల మీద దర్శనం ఇస్తున్న విషయం మర్చిపోరాదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

    అలాగే మమతా ప్రచార స్టంట్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మమతా చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవింగ్ కాస్తా.., పరోక్షంగా బీజేపీకే లాభం చేకూరుస్తోందని.,  ఎలక్ట్రిక్ స్కూటర్ నడవాలి. అందుకోసం బ్యాటరీ రీచార్జ్ చేసుకోవాలి. సోలార్ ఎనర్జీతో ఆ బ్యాటరీని రీచార్జ్ చేయాలి.. ఇదంతా పీఎం మోదీ చెబుతున్నదే…, మీరు దాన్ని ఆచరించి చూపారు…! మమతా దీదీ ఇది చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    

    Trending Stories

    Related Stories