రాజకీయాలు మరి.. ఇంత క్రూరంగా ఉంటాయా? గెలుపు కోసం నీతిని నిజాయితీని పక్కన పెట్టాలా? అబద్దాలు ఆడాలా? నాటకాలు వేయాలా.? తన మీద అభిమానంతో.. తనను చూసేందుకు వచ్చిన జనాన్ని… సైతం చివరకు నేరస్థులను చేయాల్సి వస్తుందా ?
పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ…ఈ సారి నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఇది మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కూడా కాదు. ఒకప్పుడు తనకు కుడి భుజంగా ఉండి., తనతో విభేదించి బీజేపీలో చేరిన సుబేంద్ అధికారి సొంత నియోజకవర్గం. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు., సుబేందు కుటుంబానికి… ఒక్క నందిగ్రామే కాదు.., జంగల్ మహల్ ప్రాంతంలోని దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో పట్టుంది.
తనతో విభేధించి బీజేపీలో చేరిన సుబేందుకు గట్టిగాబద్ది చెప్పాలని భావించినా మమతా ఓ బహిరంగ సభలో సుబేంద్ పై నిప్పులు చెరిగారు. తానే నందిగ్రామ్ లో సుబేందుపై పోటీ చేసి ఓడిస్తానని ఆవేశంతో శపథం చేశారు.
ఎన్నికలు షెడ్యుల్ విడుదలైంది. మమతా అన్నట్లుగానే నందిగ్రామ్ బరిలో నిలిచింది. పదేళ్ళపాటు ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో కొనసాగిన తర్వాత మమత.., క్రమంగా సామాన్య ప్రజానీకానికి దూరమయ్యారనే ప్రచారం ఉంది. ఆమె చుట్టు చేరిన కొంతమంది నాయకులతో కూడిన కోటరీ ఏర్పడిందని అంటారు. ముఖ్యంగా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే.. పార్టీ పరంగా అనేక విషయాల్లో కీలకంగా వ్యవహారించడం మొదలు పెట్టాడని.., ఇది నచ్చకనే సుబేందు మమతాతో విభేధించి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడని చెబుతారు.
నందిగ్రామ్ బరిలో దిగిన మమతా బెనర్జీలో ఏదో తెలియని భయం అవహించిందని, ఆవేశంలో ఇక్కడి నుంచి బరిలోకైతే దిగినా., గ్రౌండ్ లో ఆమె గెలుపు బాధ్యతను భూజాలపై వేసుకుని పనిచేసే క్యాడర్ అంతా కూడా సుబేందు అధికారి వైపు వెళ్లడంతో.. మమతా పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ రూపొందించిన ప్లాన్ ప్రకారమే మమతా అబద్దాలు ఆడారని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ మమతా బెనర్జీకి సలహాదారుగా వ్యవహారిస్తున్నారు. మమతా బెనర్జీపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తుల దాడి చేశారనే కట్టుకథకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా ప్రశాంత్ కిశోర్ దేనని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఒక ఘటనను గుర్తుకు తీసుకువస్తున్నారు. ఆ సమయంలో ఒకరు కోడికత్తితో జగన్ పై దాడి చేశారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా ప్రచారాన్ని మమతాపై జరిగిన దాడిని సరిపోలుస్తున్నారు.
ఇంకా స్వయంగా మమతా బెనర్జీ మీడియా ముందుకు వచ్చి…తనను నలుగురు వ్యక్తులు తోసివేశారని చెప్పడంతో… మీడియా అటెన్షన్ అంతా మమతాపై మళ్లీంది. తన పట్ల ప్రజల్లో సానుభూతి కలిగేలా., చేసేందుకు ప్లాన్ ప్రకారమే ఆమె మీడియా ముందు అబ్దాలు చెప్పారని తెలుస్తోంది.
స్వయంగా ముఖ్యమంత్రే తనపై దాడి జరిగిందని తెలుపడంతో… నేషనల్ మీడియాతోపాటు, రీజినల్ మీడియా కూడా కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండానే, మమతా బెనర్జీపై దాడి జరిగిందంటూ బ్రేకింగ్ నడిపాయి. రాత్రి నుంచి మొదలు పెడితే…, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు బెంగాల్ ప్రాంతీయ మీడియానే కాదు.., నేషనల్ మీడియా సైతం ఇదే న్యూస్ ను వన్ సైడ్ గా మమతా బెనర్జీ చెప్పిన వర్షన్ లోనే స్టోరీలు నడిపాయి.
సీఎం పదవిలో ఉన్న మమతా బెనర్జీ వెంట పోలీసులు లేరా? ఆమెకు సెక్యురిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? వంటి ప్రశ్నలను మీడియా జర్నలిస్టులు.. కనీసం తృణమూల్ నేతలను అడిగే ప్రయత్నమే చేయలేదు.
నిజానికి..నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన తర్వాత మమతా బెనర్జీ అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించింది. కదులుతున్న కారులో కూర్కొని సగం వరకు డోర్ తెరుచి… ఒక కాలు బయట పెట్టి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలింది. అయితే ఆమె వెళ్తున్న మార్గం ఇరుకు రోడ్డు. మమతా బెనర్జీని చూసేందుకు జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ముందున్న జనం ఆమె కారు డోర్ కు కొట్టుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఆమె కాలుకు గాయం అయ్యింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కానీ… ఆమెపై దాడి కాదని అటు ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం తెలిపారు.
ఇటు జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఘటన జరిగిన నందిగ్రామ్ లోని బిరులియా బజారు వద్దకు వెళ్లి పరిశీలించింది. ఘటనకు సంబంధించి స్థానికుల విచారించి వారి నుంచి వివరాలను సేకరించింది. భారీగా ఉన్న జనం మధ్యలో నుంచి మమతా బెనర్జీ కాన్వాయ్ వెళ్లిందని.. మమతాను చూసేందుకు ఒక్కసారిగా ప్రజలు ఆమె కారువైపునకు దూసుకురావడంతో…ఆమెకు గాయాలు అయ్యాయని ఈసీకి సమర్పించిన నివేదికలో ఈ బృందం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు…కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మమతా కారులో కూర్చొని సగం కాలు బయటకు పెట్టి వెళ్తున్నట్లుగా స్పష్టంగా చూడవచ్చు.
మరోవైపు..తనపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పిన మమతా బెనర్జీ.., ఆ మరుసటి రోజుకు తన స్టెట్ మెంట్ ను కాసింత మార్చారు. తాను కారు ఎక్కుతున్న సమయంలో కొంతమంది నెట్టుకుని తన కారువైపునకు వచ్చారని.. దీంతో తన ఎడమకాలి మడమ ఎముకకు, పాదానికి మోకాలికి గాయమైందని.. , ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది చెప్పింది. అవసరమైతే వీల్ ఛెయిర్ లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేస్తానని అందుకు మీ అందరి సహకారం కావాలని వీడియో సందేశం ఇచ్చింది. దీనిని తృణమూల్ కాంగ్రెస్ ట్విటర్ లో పోస్టు చేసింది.
మొత్తానికి దాడి చేశారనే అబద్ధపు ప్రచారంలో మమతా బెనర్జీ తాను అనుకున్నది సాధించారు. నేషనల్ మీడియాతోపాటు, బెంగాల్ మీడియా అటెన్షన్ ను అంతా తనవైపునకు తిప్పుకున్నారు. బెంగాల్ అంతటా బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కొంతమంది అయితే మా దీదీని చంపేస్తారా అంటూ ఎమోషనల్ గా ఏడ్చేశారు.
ఏదీ ఏమైనా ప్రశాంత్ కిశోర్ ప్లాన్ ఫలించింది. నిరసించిపోయిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీకి వ్యతిరేకంగా మెటివెట్ చేయడంలో మమతా బెనర్జీపై దాడి చేశారనే డ్రామాను బాగారే రక్తికట్టించారు.
ఇక డిఫెన్స్ లోపడినా బీజేపీ కూడా ఆలస్యం చేయకుండా మమతా అబద్దాలు ఆడుతున్నారని.., ప్రమాదవశాత్తు కిందపడితే… తనపై దాడి చేశారని ప్రచారం చేసుకుంటుందని, ఓడిపోతాననే భయంతోనే ఆమె ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ప్రజల్లో సానుభూతిని పొందేందుకు ఈ ఘటనను తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రచారం చేయిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని సైతం కోరింది. అయితే మమతా ఆడినా ఈ దొంగనాటకం ఆమెకు ఓట్లు తెచ్చిపెడుతుందా? లేక బూమరాంగ్ అవుతుందా? మే 2వ తేదీన తేలనుంది.