కాలుకు బ్యాండేజీతో ఓటర్ల సానుభూతి కొట్టేయాలనుకున్న దీదీకి.. పాపం అడుగడుగునా అగచాట్లే ఎదురవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం నందిగ్రామ్ ర్యాలీలో స్వల్పంగా గాయపడిన మమతా బెనర్జీ.. ఆ రోజు నుంచి కాలుకు బ్యాండేజీతో వీల్‌చైర్‌లోనే ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ కేడర్ దాడి చేయడం వల్లనే తన కాలికి గాయమైందని అబాంఢాలు వేసి.. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఎన్నికల డ్రామాను రక్తికట్టిస్తున్నారు. ఇటీవకాలంలో పార్టీ మేనిఫెస్టోను సైతం పక్కనపెట్టిన దీదీ.. జనానానికి ఏం చేస్తారో చెప్పకుండా.. కేవలం ప్రధాని మోదీ టార్గెట్ గానే ప్రచారం సాగిస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైందటే.. మమత బ్యాండేజీ టీఎంసీ ఎన్నికల బ్రాండ్ గా మారిపోయింది. టీఎంసీ నాయకులు దీదీ వీల్ చైర్ కు, బ్యాండేజీకి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు టీఎంసీ లీడర్లు.. తమ పైత్యాన్ని ప్రదర్శించారు. ప్రధాని అన్న గౌరవం కూడా లేకుండా.. దీదీ తన బ్యాండేజీ వున్న కాలుతో.. మోదీ తలపై తొక్కుతున్నట్టుగా ప్రచారం చేశారు. ఎలక్షన్ వాల్ రైటింగ్స్ లో.. గోడలన్నీ ఇవే చిత్రాలతో నింపేశారు. దీనిపై బీజేపీ నేతలతో పాటు.. బెంగాల్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
ఇదిలావుంటే, తాజాగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఈ ఫొటోపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దీదీ మీరు నా తలపై కాలుతో తన్నితే తన్నండి.. కానీ, బెంగాల్ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా మాత్రం నన్నెవరూ ఆపలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, గతంలో మోదీ ముఖం చూస్తేనే కంపరంగా వుంటుందన్న దీదీ వ్యాఖ్యలపైనా ప్రధాని తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ముఖం కంటే ప్రజాసేవే ముఖ్యమని దిమ్మదిరిగేలా సమాధానం చెప్పారు. గడిచిన పదేళ్లుగా ఉత్తుత్తి హామీలతోనే మమత కాలం వెళ్లదీస్తున్నారని, నిజంగా ప్రజలకు ఏమేమీ మంచి పనులు చేశారో చెప్పాలని దీదీని నిలదీశారు. ఆట మొదలైందని దీదీ చెబుతున్నా, నిజానికి ఆమె ఆట ముగిసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇదే చెప్పబోతున్నారని అన్నారు. ఇలా మోదీ తనదైన శైలిలో ఇచ్చిన కౌంటర్లతో దీదీ అండ్ పార్టీకి దిమ్మదిగిరిపోయింది. బ్యాండేజ్ ప్లాన్ కాస్తా బ్యాడ్ లక్ గా మారింది.
నిజానికి, మమతా బెనర్జీ బ్యాండేజీ ప్లాన్.. ఎన్నికల మేధావి ప్రశాంత్ కిషోర్ మెదడు నుంచి పుట్టిన ఓ చవకబారు స్ట్రాటెజీ అన్నది బహిరంగ రహస్యం. దీదీ కాలుకు బ్యాండేజీ కట్టి.. వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి.. ఓటర్ల సానుభూతి కొట్టేయాలని బాగానే ప్లాన్ చేశాడు ప్రశాంత్ కిషోర్. కానీ, టీఎంసీ నేతల అత్యుత్సాహం, మోదీ సమయస్ఫూర్తితో వారి ప్లాన్ బెడిసికొట్టినట్టయింది. ఇప్పటికే దీదీ బ్యాండేజీ నాటకంపై బెంగాల్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇదంతా ఓట్ల కోసం చేసిన గారడీ అన్న విషయం తెలిసి.. దీదీ దిగజారుడు రాజకీయాల్ని బెంగాలీ ప్రజలు అసహ్యించుకుంటున్నారట. అటు, ఇలాంటి ఔట్ డేటెడ్ సలహాలు ఇచ్చే బదులు.. ఏవైనా మంచి సలహాలు ఇవ్వొచ్చు కదా అంటూ.. ప్రశాంత్ కిషోర్ పై సెటైర్లు కూడా వేస్తున్నారట. దీంతో వీల్ చైర్ నాటకాన్ని ఆపేస్తేనే బెటరని.. లేదంటే జనంలో మరింత వీకవుతామని భావిస్తున్నాట టీఎంసీ నేతలు. ఈ విషయాన్ని దీదీకి చెప్పలేక, జీర్ణించుకోలేక లోలోన గొణుక్కుంటున్నారట.