More

  ప్రధాని మోదీని 30నిమిషాలు వెయిట్ చేయించిన మమతా బెనర్జీ

  బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇది తగునా.? ఆమె మూడు సార్లు సీఎం అయ్యారు.! దేశ ప్రధాని వస్తుంటే… ప్రభుత్వపరంగా అనుసరించాల్సిన ప్రొటోకాల్ నియమాలు ఆమెకు తెలియదా? యాస్ తుపాన్ నష్టం..సహాయక చర్యలపై ప్రధాని మోదీ స్వయంగా సమీక్ష నిర్వహిస్తుంటే…ఆ సమావేశానికి 30 నిమిషాలు లేటుగా వచ్చారు మమతా బెనర్జీ.! అంతసేపు కూడా ప్రధాని నరేంద్రమోదీతోపాటు, గవర్నర్ ధన్కర్ కూడా ఆమె రాక కోసం వేచి చూశారు.

  అయితే 30 నిమిషాల తర్వాత వచ్చిన మమతా బెనర్జీ తుపాను నష్టంకు సంబంధించిన కొన్ని పత్రాలను పీఎం మోదీకి సమర్పించి ఆ వెంటనే అక్కడ నుంచి నిష్క్రమించారు. తనకు అధికారికంగా వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

  అయితే మొదట పీఎం మోదీతో జరగబోయే సమీక్షా సమావేశానికి తాను హాజరు కాబోనని, బెంగాల్ ప్రభుత్వ కార్యదర్శి అల్పన్ బందోపాధ్యాయ్ వెళ్తారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.., మనస్సు మార్చుకుని..,  తాను ఆ సమీక్ష సమావేశానికి హాజరవుతానని ప్రకటించించారు. అయితే ప్రకటించిన తర్వాత ఆమె సమావేశానికి ఆలస్యంగా హాజరవ్వడమే కాకుండా…, ఆ వెంటనే వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  యాస్ తుపాన్ కారణంగా బెంగాల్ లో దాదాపు 15 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. తక్షణ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో NDRF దళాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వీలుయినంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది.

  అయితే ఈ ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందించేందుకు కేంద్రం తన బాధ్యతగా భావించి ముందుకు వచ్చింది. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లో స్వయంగా ప్రధాని మోదీ పర్యటించారు. అయితే మమతా బెనర్జీ మాత్రం సమీక్ష సమావేశానికి ఆలస్యంగా రావడంతో…, తన బాధ్యతల పట్ల ఆమెకున్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతూనే ఉందని.. లేటు రావడం అంటే పీఎం మోదీని అవమానించడమేనని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మమతా బెనర్జీ ఇలా బెట్టు రాజకీయాలు చేయడం ఏంటని మరికొందరు నెటిజన్లు పశ్నిస్తున్నారు.

  అయితే ఇదే సమయంలో పీఎం మోదీ ఒడిశా పర్యటన బెంగాల్ కంటే భిన్నంగా సాగింది. భువనేశ్వర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఒడిశా సీఎంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నాధికారులు హజరయ్యారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన బాలేశ్వర్, భద్రక్, కేంద్రపడ, మయూర్ భంజ్ జిల్లాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పీఎం మోదీకి వివరించారు. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారని ప్రస్తుతం రాకపోకలు మెరుగయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో పనులు పూర్తికావడానికి మరో రెండు రోజులు పడుతుందని చెప్పారు.

  అంతకు ముందు యాస్ తుపానులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పీఎం మోదీ తన సంతాపం తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన వారి కుటంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల సహాయాన్ని ప్రకటించారు. ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని, అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఒడిశా, పశ్చిమబెంగాల్,

  జార్ఖండ్ ప్రభుత్వాలకు ప్రధాని భరోసా ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో భరోసా కల్పించిన సీఎం మాత్రం తుపాను సమయంలో కూడా రాజకీయాలు చేయడం ఎంత వరకు కరెక్టు? దేశ ప్రజలే నిర్ణయించాలి.

  Related Stories