More

    కూర్చుని జాతీయగీతాన్ని సగం.. సగం.. పాడుతూ.. అవమానించిన మమతా బెనర్జీ..!

    జాతీయగీతానికి మనం ఎంతో గౌరవం ఇస్తాం. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించిన తీరు చూస్తుంటే ఓ వైపు కోపం.. మరో వైపు బాధ కూడా వస్తోంది. సగం మాత్రమే పాడి.. తనకు నచ్చిన చోట ఆపేయడం ఆమె గర్వానికి ప్రతీక అని పలువురు అంటున్నారు.

    మమతా బెనర్జీ ముంబైలో ఒక సభలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఫిర్యాదు నమోదైంది. ముంబైకి చెందిన ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. “జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారు” అని, కూర్చున్న స్థానంలో ఆలపించారని, 4 లేదా 5 లైన్ల తర్వాత అకస్మాత్తుగా ఆపివేసారు అని మమతా బెనర్జీపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీ జాతీయ గీతానికి చేసిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అవమానిస్తూ చేసిన చేష్టలు వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించాయి. ఆమె కూర్చొని జాతీయ గీతాన్ని పాడటం ప్రారంభించి, ఆపై అర్ధాంతరంగా ముగించేశారు. బీజేపీ ముంబై కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

    మమతా బెనర్జీ “కూర్చున్న స్థితిలో జాతీయ గీతం పాడటం ప్రారంభించి, ఆ తర్వాత లేచి నిలబడ్డారని, నాలుగు లేదా ఐదు లైన్లు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారని” ముంబైలోని పోలీస్ కమీషనర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చర్యలు జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచేలా ఉన్నాయని, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరైనా జాతీయ గీతం యొక్క చిన్న వెర్షన్ పాడాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా మొదటి రెండు లైన్లు మరియు చివరి రెండు లైన్లను పాడాలి. కానీ మమతా బెనర్జీ చేసినదంతా తప్పేనని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.

    బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ఒక ట్వీట్‌లో “మన జాతీయ గీతం అత్యంత శక్తివంతమైన గుర్తింపులో ఒకటి. ప్రభుత్వ పదవిలో ఉన్నవారు ఇలా కించపరచకూడదు.మన జాతీయ గీతాన్ని కించ పరుస్తూ బెంగాల్ సీఎం పాడిన పాటకు సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. అపోజిషన్ లో ఉన్న వాళ్లు అహంకారంతో దేశభక్తిని మరిచారా” అని ప్రశ్నించారు.

    ముంబైకి చెందిన బీజేపీ నాయకుడు మోహిత్ కాంబోజ్ భారతీయ ఈ వీడియోను షేర్ చేస్తూ “ఆమె కూడా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు” అని అన్నారు. జాతీయగీతాన్ని కించ పరిచే వ్యక్తులు కూడా భారతదేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మరో ట్వీట్ లో మమతా బెనర్జీని అరెస్టు చేయాలని కోరారు. ఈవెంట్ నిర్వాహకులతో సహా ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ముంబై పోలీసులను కోరారు. ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో మన జాతీయగీతాన్ని అవమానించినందుకు మమతాబెనర్జీతో పాటూ.. నేటి ఈవెంట్ నిర్వాహకులపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని కోరారు. తానే రాతపూర్వక ఫిర్యాదు చేస్తానని కూడా తెలిపారు.

    ఆమె చర్యపై పశ్చిమ బెంగాల్ బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. “మమతా బెనర్జీ మొదట కూర్చున్నారు, ఆపై లేచి నిలబడి భారతదేశ జాతీయ గీతాన్ని సగం వరకు పాడి ఆపేసారు. ఈరోజు ఆమె ముఖ్యమంత్రిగా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు!” అంటూ ఆమె వీడియోను షేర్ చేశారు.

    బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ “ముంబయిలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగ పదవిలో ఉండి జాతీయ గీతాన్ని అవమానించారు. ఆమెకు జాతీయ గీతానికి మర్యాద ఇవ్వడం తెలియదా, లేక తెలిసి అవమానిస్తున్నారా?” అని ప్రశ్నించారు.

    ఎంపీ, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. ‘‘మన జాతీయ గీతాన్ని గౌరవించడంలో విఫలమైన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు భారత్ మరియు దాని విలువలను గౌరవించాలని ఈ రోజుల్లో అడగాల్సి వస్తోందని” అన్నారు. ఈ దుర్భరమైన ప్రవర్తన చాలా సిగ్గుచేటు, ఖండించదగినది అన్నారు.

    తృణమూల్ కాంగ్రెస్ ఈ ఘటనపై స్పందించలేదు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ముంబైలో ఆయన నివాసంలో మమతా కలిశారు. ఆయనతో భేటీ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో యూపీఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామన్నారు. అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మౌనంగా కూర్చుంది. ఆ పార్టీ ఏమీ చేయడం లేదు.. మనం కూడా నిశ్శబ్దంగా కూర్చుందామా? యూపీఏ ఇప్పుడు లేదు. ఆప్షన్లు ఇవ్వడం తప్పనిసరి. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు ప్రధానం కాదని అన్నారు.

    Trending Stories

    Related Stories