More

    బీఎస్ఎఫ్ పై మరోసారి విషం కక్కిన మమత

    భారత్ లోకి తీవ్రవాదులు, ఎటువంటి అరాచక శక్తులు చొరబడకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) కాపలా కాస్తోంది. అయితే కొందరు నాయకులు వారిపై కూడా విషం కక్కి దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనే సంకేతాలను ఇస్తూ ఉన్నారు. అలాంటి వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ కూడా ఒకరు. పొరుగు దేశాల‌తో స‌రిహ‌ద్దు పంచుకుంటున్న జిల్లాల్లో చాలా జాగ్ర‌త్త‌గా మ‌సులుకోవాల‌ని రాష్ట్ర పోలీసుల‌కు సూచించారు. ఈ ప్రాంతాల్లో బీఎఎస్ఎఫ్ కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసి ఉంచాల‌ని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బీఎస్ఎఫ్ కార్య‌క‌లాపాల‌కు నిర్దేశించిన ప్రాంతానికి మించి, ఇత‌ర ప్రాంతాల్లోకి వారి కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని క‌రాఖండిగా తెలిపారు. శాంతిభ‌ద్ర‌త‌ల అంశాన్ని రాష్ట్ర‌ ప‌రిధిలోనే ఉంచాల‌న్నారు.

    చెప్పాపెట్ట‌కుండా బీఎస్ఎఫ్ జ‌వాన్లు గ్రామాల్లోకి ప్ర‌వేశిస్తారు. త‌మ‌ను ఇబ్బందులు పెడుతున్నార‌ని సంబంధిత గ్రామాల ప్ర‌జ‌లు ఫిర్యాదులు చేస్తారు. ఈ విష‌యం నాకు బాగా తెలుసని మమతా చెప్పుకొచ్చారు. పోలీసుల‌కు చెప్ప‌కుండానే త‌మ ప‌రిధిని దాటి వెళ్లిపోతుంటారని బీఎస్ఎఫ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకే పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకునే జిల్లాల పోలీసులను వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని కోరుతున్నానని అన్నారు. BSF తన నిర్దేశిత అధికార పరిధిని ఉల్లంఘించడాన్ని అనుమతించవద్దని ఆమె తమ రాష్ట్ర పోలీసులను కోరారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని చెప్పారు. కర్నాజోరాలో జరిగిన ఉత్తర దినాజ్‌పూర్ మరియు దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాల పరిపాలనా సమీక్ష సమావేశంలో బెనర్జీ అన్నారు. నాగాలాండ్‌లో… అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏమి జరిగిందో అందరూ చూశారు. ఇటీవల కూచ్‌బెహార్‌లో కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు… నేను బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లు, ఇన్‌స్పెక్టర్లు-ఇన్‌చార్జిలను అప్రమత్తంగా ఉండమని చెబుతున్నానన్నారు.

    కేంద్రంతో ఉన్న వైరం కారణంగా పశ్చిమ బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ సరిహద్దు భద్రతా దళం అధికార పరిధిని 15 కిమీ నుండి 50 కిమీకి పొడిగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 17 న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య దేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే ప్రయత్నమని ఆమె విమర్శించారు.

    పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి అంతకుముందు 15-కిమీ పరిమితి నుండి 50-కిమీల పరిధిలో సెర్చింగ్, అరెస్టులను చేపట్టడానికి బలగాలను అనుమతించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం BSF చట్టాన్ని సవరించింది. “సరిహద్దు ప్రాంతాల్లో మాకు సమస్యలు లేవు పొరుగు దేశాలతో చాలా స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటాము. ఈ గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం” అని మమతా బెనర్జీ అన్నారు.

    బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్‌లతో సరిహద్దులను పంచుకునే పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దు సంబంధిత సమస్యలు లేవని మమతా బెనర్జీ పేర్కొన్నప్పటికీ.. బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో స్మగ్లింగ్, ముఖ్యంగా గోవుల స్మగ్లింగ్ లో విపరీతమైన పెరుగుదల ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ఉన్న పోరస్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద స్మగ్లింగ్ బిడ్‌లను భగ్నం చేయడంలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది.

    Trending Stories

    Related Stories