మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే రాజీనామా

0
954

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే రాజ్య‌స‌భలో ప్ర‌తిప‌క్ష నేత పోస్టుకు రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశారు. వన్ లీడర్ వన్ పోస్ట్ అనే తీర్మానాన్ని అనుసరించి, ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.

ఆ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వార‌మే ఆయ‌న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా రేసులో చిదంబ‌రం, దిగ్విజ‌య్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శుక్రవారం మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తామని జి-23 నేతలు పృథివీరాజ్ చవాన్, మనీష్ తివారీ, భూపిందర్ హుడా ప్రకటించారు. దిగ్విజయ సింగ్, పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని, బదులుగా తన సీనియర్ మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తానని ప్రకటించారు.